జేసీ పోలీసులపై వేటు

తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమం వద్ద గొడవ వ్యవహారంపై పోలీసులపై వేటు పడింది. స్థానిక సీఐ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. తాడిపత్రి డీఎస్పీ విజయకుమార్‌ను వీఆర్‌కు పంపేందుకు రంగం సిద్ధమైంది. సీఐ, ఎస్‌ ఐ లు జేసీ వర్గీయులకు వంతపాడడం వల్లే ఈ గొడవ జరిగిందని ఉన్నతాధికారులు గుర్తించారు. గొడవ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా గణేష్ నిమజ్జన ఊరేగింపును స్థానిక పోలీసు అధికారులు ఆశ్రమం ముందు నుంచి అనుమతివ్వడం వల్లే గొడవ […]

Advertisement
Update:2018-09-28 02:51 IST

తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమం వద్ద గొడవ వ్యవహారంపై పోలీసులపై వేటు పడింది. స్థానిక సీఐ సురేంద్రనాథ్ రెడ్డి, ఎస్‌ఐ రామకృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. తాడిపత్రి డీఎస్పీ విజయకుమార్‌ను వీఆర్‌కు పంపేందుకు రంగం సిద్ధమైంది. సీఐ, ఎస్‌ ఐ లు జేసీ వర్గీయులకు వంతపాడడం వల్లే ఈ గొడవ జరిగిందని ఉన్నతాధికారులు గుర్తించారు.

గొడవ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా గణేష్ నిమజ్జన ఊరేగింపును స్థానిక పోలీసు అధికారులు ఆశ్రమం ముందు నుంచి అనుమతివ్వడం వల్లే గొడవ జరిగిందని ఉన్నతాధికారులు తేల్చారు. దీంతో సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిద్దరూ జేసీ కనుసన్నల్లోనే పనిచేశారన్నది ప్రధాన ఆరోపణ.

Tags:    
Advertisement

Similar News