విదేశీ ఆవు పాలతో ఆవేశం, హైబీపీ వస్తాయట....
సనాతన హిందూ ధర్మంలో గోవుల ప్రాధాన్యతను వివరిస్తూ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ విరాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఆవు పాలతో ఆవేశం పెరుగుతుందని, హైబీపీ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా పాల్గొన్నారు. విదేశీ ఆవుల పాలతో హై బ్లడ్ ప్రెషర్ వస్తుందని, జెర్సీ ఆవుల పాలు మానవులకు మంచివి కావని […]
సనాతన హిందూ ధర్మంలో గోవుల ప్రాధాన్యతను వివరిస్తూ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ విరాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఆవు పాలతో ఆవేశం పెరుగుతుందని, హైబీపీ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా పాల్గొన్నారు. విదేశీ ఆవుల పాలతో హై బ్లడ్ ప్రెషర్ వస్తుందని, జెర్సీ ఆవుల పాలు మానవులకు మంచివి కావని ఆయన అన్నారు.
దేశీ ఆవుల పాలే ఆరోగ్యానికి మంచివని గవర్నర్ వ్యాఖ్యానించారు. హిమాచల్ గవర్నర్‌కు హర్యానాలోని కురుక్షేత్రలో 200 ఎకరాల ఫార్మ్‌హౌస్ ఉంది. అందులో ఆయనకు 300 ఆవులున్నాయి కూడా. దేశీ ఆవుల మూత్రం, పేడలతో తయారు చేసే జీవామృతం మంచి ఎరువులా పనిచేస్తుందని, దాని సాయంతో ఎలాంటి ఖర్చు లేకుండా సాగు చేయవచ్చని గవర్నర్ వివరించారు.
ఈ ఎరువుతో భూమిలో సారం పెరగడమే కాకుండా భూమిని గుల్లగా చేసే వానపాములు వృద్ధిచెందుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో హర్యానా ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని స్వీకరించిందని, రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని గవర్నర్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కూడా గో సంరక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదంటూ అభినందించారు. ఒక ఆవు నుంచి తయారు చేసే జీవామృతంతో 30 ఎకరాలను సాగు చేయవచ్చని గవర్నర్ తెలిపారు.