రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే రేవంత్ రెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులకు దిగారు. హైదరాబాద్‌తో పాటు కొడంగల్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ ఐటీ రైడ్‌ కొనసాగుతోంది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డిపై హఠాత్తుగా ఏకంగా ఐటీ దాడులకు దిగడం చర్చనీయాంశమైంది. దాడుల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ […]

Advertisement
Update: 2018-09-26 21:57 GMT

టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే రేవంత్ రెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులకు దిగారు. హైదరాబాద్‌తో పాటు కొడంగల్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ ఐటీ రైడ్‌ కొనసాగుతోంది.

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డిపై హఠాత్తుగా ఏకంగా ఐటీ దాడులకు దిగడం చర్చనీయాంశమైంది. దాడుల్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులతో కాంగ్రెస్ నేతలతో పాటు…. టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు నేపథ్యంలో ఓటుకు నోటు కేసును మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు అందుకు తగ్గట్టే ఐటీ రంగంలోకి దిగడంతో చంద్రబాబు బృందం ఆందోళనకు గురి అవుతోంది.

Advertisement

Similar News