కేవీపీపై జేడీ శీలం ఆగ్రహం
కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు ఫ్యాన్స్ ఇప్పుడు బహిరంగంగానే గళం విప్పుతున్నారు. అధికారంలో ఉంది చంద్రబాబు కావడంతో ఆయన పాలన తప్పులను ఎత్తి చూపిన వారిపై కాంగ్రెస్‌లోని చంద్రబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విజయవాడలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఈ విషయం బహిర్గతమైంది. చంద్రబాబు పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఒక డాక్యుమెంటరీని తయారు చేయించారు. ఈ డాక్యుమెంటరీని కార్యక్రమంలో ప్రదర్శించారు. దీన్ని చూసిన సీనియర్ నేత జేడీ శీలం ఆగ్రహంతో ఊగిపోయారు. […]
కాంగ్రెస్‌లో ఉన్న చంద్రబాబు ఫ్యాన్స్ ఇప్పుడు బహిరంగంగానే గళం విప్పుతున్నారు. అధికారంలో ఉంది చంద్రబాబు కావడంతో ఆయన పాలన తప్పులను ఎత్తి చూపిన వారిపై కాంగ్రెస్‌లోని చంద్రబాబు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
విజయవాడలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఈ విషయం బహిర్గతమైంది. చంద్రబాబు పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ఒక డాక్యుమెంటరీని తయారు చేయించారు. ఈ డాక్యుమెంటరీని కార్యక్రమంలో ప్రదర్శించారు. దీన్ని చూసిన సీనియర్ నేత జేడీ శీలం ఆగ్రహంతో ఊగిపోయారు.
కేవలం చంద్రబాబును మాత్రమే ఎందుకు విమర్శించారంటూ అసహనం వ్యక్తం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన ఏంటి? దీని వల్ల పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా? కేవలం చంద్రబాబును మాత్రమే విమర్శిస్తూ డాక్యుమెంటరీని చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది తప్ప జగన్‌ను ప్రశ్నించేలా లేదని శీలం అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కంటే వైసీపీనే మనకు ప్రధాన శత్రువు అంటూ జేడీ శీలం వాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ డాక్యుమెంటరీ చేస్తే…. ప్రతిపక్ష పార్టీని ఎందుకు విమర్శించడం లేదని జేడీ శీలం వాదించడం ద్వారా ఆయన రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్టుగా ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
అయినా చంద్రబాబును విమర్శిస్తే జేడీ శీలం ఈస్థాయిలో బట్టలు చించుకోవాల్సిన అవసరం ఏమిటని పలువురు అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఏమని విమర్శించాలని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.
మొత్తం మీద తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు కాపురం కుదిరింది. ఇంకా ఏపీలో మూడుముళ్ల బంధం పడకముందే కాంగ్రెస్ నేతలు చంద్రబాబు మెప్పు కోసం బాగానే కష్టపడుతున్నట్టుగా ఉన్నారు.