మహిళకు ముందుజాగ్రత్తల మేలుకొలుపు!
మహిళల ఎదుగుదలకు ఆటంకాలుగా మారుతున్న వాటిలో అనేక శారీరక, మానసిక సమస్యలు ఉన్నాయి. వాటిపట్ల ఎంత ఎక్కువ అవగాహన పెంచుకుంటే అంతగా వాటిని నివారించుకునే అవకాశాలు ఉంటాయి. సంతానలేమితో బాధపడే మహిళలు ఇందుకు ఇతర కారణాలు లేకపోతే ఒత్తిడి వలన అలా జరుగుతుందేమో చెక్ చేయించుకోవాలి. సంతానం లేదనే బాధ వలన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఒత్తిడి పెరిగిపోతే సంబంధిత హార్మోన్లు ఓవలేషన్ కి, ఫెర్టిలైజేషన్‌కి అడ్డుపడుతుంటాయి. ఇదంతా ఒక విష వలయం లాంటిది. దీని నుండి […]
Advertisement
మహిళల ఎదుగుదలకు ఆటంకాలుగా మారుతున్న వాటిలో అనేక శారీరక, మానసిక సమస్యలు ఉన్నాయి. వాటిపట్ల ఎంత ఎక్కువ అవగాహన పెంచుకుంటే అంతగా వాటిని నివారించుకునే అవకాశాలు ఉంటాయి.
- సంతానలేమితో బాధపడే మహిళలు ఇందుకు ఇతర కారణాలు లేకపోతే ఒత్తిడి వలన అలా జరుగుతుందేమో చెక్ చేయించుకోవాలి. సంతానం లేదనే బాధ వలన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఒత్తిడి పెరిగిపోతే సంబంధిత హార్మోన్లు ఓవలేషన్ కి, ఫెర్టిలైజేషన్‌కి అడ్డుపడుతుంటాయి. ఇదంతా ఒక విష వలయం లాంటిది. దీని నుండి బయటపడాలంటే యోగా చక్కగా ఉపయోగపడుతుందని హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. రోజూ ఇరవై నిముషాల యోగాతో ఒత్తిడి హార్మోనుని తేలిగ్గా తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు.
- మెనోపాజ్‌కి చేరువవుతున్న దశలో మహిళలను ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ తాలూకు ఇబ్బందులు బాగా బాధిస్తుంటాయి. శరీరంలో ప్రొజెస్టిరాన్ హార్మోను స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులే ఇందుకు కారణం. ఈ పరిణామంతో మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే సెరటోనిన్ ని ఉత్పత్తి చేసే సామర్ధ్యం మెదడుకి తగ్గుతుంది. యూనివర్శిటీ ఆఫ్ యేల్ సైంటిస్టులు దీని విరుగుడుకి కొన్నిసలహాలు ఇస్తున్నారు. శరీరానికి తగిన సూర్యరశ్మి అందకపోవడం వలన ఇలా జరిగే అవకాశం ఉంది కనుక రోజూ ఓ అరగంటపాటు సూర్యకాంతి తగిలేలా వ్యాయామం చేయడమో, లేదా సాయంత్రపు ఎండలో నడవడమో చేయాలని వారు సూచిస్తున్నారు. దీంతో ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ తెచ్చిపెట్టే ఆందోళన, టెన్షన్‌లాంటివి సగానికి సగం తగ్గుతాయని వారు చెబుతున్నారు. సూర్య కాంతిలోని యువి కిరణాలు, మెదడు కణాలను సెరటోనిన్ ఉత్పత్తికి పురికొల్పడంతో ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
- మెనోపాజ్ వయసుకి చేరుకున్నాక దాదాపు 85శాతం మంది మహిళల్లో వేడి ఆవిర్లు సమస్య ఉంటుంది. ఈస్ట్రోజన్ హోర్మోను స్థాయి తగ్గటం వలన మెదడులో జరిగే మార్పులతో చర్మపు ఉష్ణోగ్రత మూడునుండి ఆరు డిగ్రీలు పెరిగిపోయి అలా జరుగుతుంది. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడంతో ఈ పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది.
- శరీరానికి ఉపయోగించే సువాసనా భరిత పౌడర్లు జననాంగాల ప్రాంతంలో వినియోగించడం వలన అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18శాతం పెరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఆస్‌బెస్టాస్ లాంటి ఖనిజ రసాయనాలు ఉండడమే ఇందుకు కారణం. వీటికి బదులుగా కార్న్ స్టార్చ్ తో చేసిన పౌడర్లు వినియోగించడం వలన ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు.
- పీరియడ్స్ సమయంలో మైగ్రేన్ తలనొప్పులు 71శాతం ఎక్కువగా వేధిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఉదయపు అల్పాహారాన్ని తీసుకోవాలి. రోజువారీ మామూలుగా తీసుకునే ఆహారాన్ని మానకూడదు.
- ఒకప్పుడు భయపెట్టిన సర్వికల్ క్యాన్సర్ ఇప్పుడు ముందుగా కనిపెడితే నూరుశాతం తగ్గించే అవకాశాలున్నాయి. కాబట్టి డాక్టర్ సలహాలతో పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి.
Advertisement