చంద్రుడిలో సాయిబాబా ఫొటో వైరల్.... డాబాలపైకి ఎక్కి....
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట వెనకటికొకడు. ఆదివారం అర్ధరాత్రి అదే జరిగింది. చంద్రుడిలో సాయిబాబా రూపం అంటూ ఫేస్ బుక్, వాట్సప్ లలో తెగ ప్రచారం జరిగింది. షేరింగ్ లు కూడా ఎక్కువగా జరిగాయి. ఇది ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి ప్రజలు ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఇంతకీ అసలు చంద్రుడిలో బాబా ఉన్నాడా లేడా అన్నదేగా మీ డౌట్.. విషయమేమిటంటే ఎవరో ఓ ఆకతాయి నిండుగా కనిపిస్తున్న చంద్రుడి […]
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడట వెనకటికొకడు. ఆదివారం అర్ధరాత్రి అదే జరిగింది. చంద్రుడిలో సాయిబాబా రూపం అంటూ ఫేస్ బుక్, వాట్సప్ లలో తెగ ప్రచారం జరిగింది. షేరింగ్ లు కూడా ఎక్కువగా జరిగాయి. ఇది ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి ప్రజలు ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఇంతకీ అసలు చంద్రుడిలో బాబా ఉన్నాడా లేడా అన్నదేగా మీ డౌట్..
విషయమేమిటంటే ఎవరో ఓ ఆకతాయి నిండుగా కనిపిస్తున్న చంద్రుడి ఫొటో తీసుకుని ఫొటోషాప్ లో సాయిబాబా బొమ్మను జాగ్రత్తగా ఉంచాడు. అసలు చంద్రుడిలో బాబా ఉన్నాడేమో అన్నంతలా ఉంది ఆ ఫొటో. ఇది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండగానే, ప్రజల్లో భక్తి భావం కూడా మొదలైంది.
అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చందమామను తదేకంగా చూస్తూ ఉండిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాయిబాబాను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకున్నారు. కొంతమంది డాబాలపైకి ఎక్కి పూజలు కూడా చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థతి నెలకొంది.
కొందరు అదంతా ట్రాష్ అంటూ కొట్టిపడేయగా, మరికొందరు మాత్రం రాత్రంతా చంద్రున్ని చూస్తూ ఉండిపోయారు.