ఇదో ప్రచారం.... మారువేషంలో సుధీర్ బాబు

తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు, ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించేందుకు.. అప్పట్లో రాజులు మారువేషాల్లో తిరిగేవారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా అదే పనిచేస్తున్నాడు. తన గురించి, తన సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు, మారు వేషంలో థియేటర్లలో కలియతిరుగుతున్నాడు సుధీర్ బాబు. దీనివల్ల అటు సినిమాకు ప్రచారం కల్పించడంతో పాటు ఇటు ఫీడ్ బ్యాక్ కూడా తెలుసుకోవడం ఈజీ అవుతుంది.  ఇప్పటికే హైదరాబాద్, నైజాంలోని పలు థియేటర్లలో ఇలా మారువేషంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, […]

Advertisement
Update:2018-09-23 16:45 IST

తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు, ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించేందుకు.. అప్పట్లో రాజులు మారువేషాల్లో తిరిగేవారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా అదే పనిచేస్తున్నాడు. తన గురించి, తన సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు, మారు వేషంలో థియేటర్లలో కలియతిరుగుతున్నాడు సుధీర్ బాబు. దీనివల్ల అటు సినిమాకు ప్రచారం కల్పించడంతో పాటు ఇటు ఫీడ్ బ్యాక్ కూడా తెలుసుకోవడం ఈజీ అవుతుంది.

ఇప్పటికే హైదరాబాద్, నైజాంలోని పలు థియేటర్లలో ఇలా మారువేషంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, ”నన్ను దోచుకుందువటే” సినిమా చూశాడు సుధీర్ బాబు. ఎవరూ గుర్తుపట్టకపోతే ఆ థియేటర్ వద్ద తనే ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో పెడుతున్నాడు. గుర్తుపట్టిన వాళ్లతో సెల్ఫీ దిగుతున్నాడు.

త్వరలోనే ఇలా మారువేషంలో ఏపీలోని కొన్ని మెయిన్ సెంటర్లలో సందడి చేయబోతున్నాడు సుధీర్ బాబు. అతడ్ని గుర్తుపడితే ఫ్రీగా సెల్ఫీ దిగేయొచ్చు. తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చేయని సరికొత్త ప్రచారం ఇది.

ఇంతకీ ఎన్నడూ లేనిది, సుధీర్ బాబు ఇప్పుడే ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడో తెలుసా. ఎందుకేంటి.. ఇది సుధీర్ బాబు స్వయంగా నిర్మించి నటించిన సినిమా. ప్రశంసలు రాకపోయినా ఫర్వాలేదు, డబ్బులు రావాలి కదా. అందుకే ఈ కష్టమంతా.

Tags:    
Advertisement

Similar News