సొంత జిల్లాలో బాబుకు షాకుల మీద షాకులు!

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ను కలిసి ఆశ్చర్యపరిచాడు చదలవాడ క్రిష్ణమూర్తి. ఆయన టీటీడీ మాజీ చైర్మన్ అయ్యాక రాజకీయాల నుంచి ఇక తప్పుకున్నట్టే అని అంతా అనుకుంటుంటే…. ఆయన అనూహ్యంగా జనసేన వైపు చూస్తుండటం ఆసక్తిదాయకంగా మారింది. తనకు గనుక తిరుపతి టికెట్ ఇస్తే జనసేనలో చేరడానికి సై అన్నాడట చదలవాడ. ఈయన టీడీపీ తరఫునే అభ్యర్థిత్వాన్ని ఆశించాడు. అయితే అది జరిగేలా లేదు. ఇక అక్కడ అవకాశం దక్కదని తెలిసాక వైఎస్సార్ కాంగ్రెస్ […]

Advertisement
Update: 2018-09-22 22:49 GMT

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ను కలిసి ఆశ్చర్యపరిచాడు చదలవాడ క్రిష్ణమూర్తి. ఆయన టీటీడీ మాజీ చైర్మన్ అయ్యాక రాజకీయాల నుంచి ఇక తప్పుకున్నట్టే అని అంతా అనుకుంటుంటే…. ఆయన అనూహ్యంగా జనసేన వైపు చూస్తుండటం ఆసక్తిదాయకంగా మారింది. తనకు గనుక తిరుపతి టికెట్ ఇస్తే జనసేనలో చేరడానికి సై అన్నాడట చదలవాడ. ఈయన టీడీపీ తరఫునే అభ్యర్థిత్వాన్ని ఆశించాడు. అయితే అది జరిగేలా లేదు.

ఇక అక్కడ అవకాశం దక్కదని తెలిసాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. వైసీపీకి అక్కడ భూమన ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడా ఛాన్స్ దక్కకపోవడంతో ఈయన జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడుకు ఇది తలనొప్పి వ్యవహారమే. ఎందుకంటే ఇలా జనసేన వైపు చూస్తున్నది కేవలం చదలవాడ మాత్రమే కాదు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా జనసేన వైపుకు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె లేదని ఖండిస్తున్నారు కానీ.. ఆమె కూడా జంప్ కానున్నదని టాక్. కేవలం తిరుపతి వరకే కాదు.. చిత్తూరు జిల్లాలో జనసేనలోకి మరికొన్ని వలసలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ లోకి కొంతమంది ఫిరాయింపుల ఎంట్రీతో సీట్లను కోల్పోతున్న పలువురు నేతలు ఇప్పుడు జనసేన వైపుకు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఫిరాయింపుల వల్ల ఏదో సాధించానని అనుకుంటున్నాడు కానీ…. వారి వల్ల టీడీపీ నేతలు చేజారిపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News