ఇదోరకం బెదిరింపు

కాపురాల్లో రేగే క‌ల‌త‌ల‌ను టీవీల్లో లోకానికి తెలియ‌జేస్తూ పంచాయ‌తీలు చేస్తున్నారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న బతుకు జ‌ట్కా బండి కార్య‌క్ర‌మం ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకుంది. త‌న‌ను బ‌త‌కు జ‌ట్కాబండి కార్య‌క్ర‌మానికి రావాలంటూ ఈ కార్య‌క్ర‌మం ప్ర‌యోక్త‌ జీవిత రాజ‌శేఖ‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటో డ్రైవర్‌. ఇత‌నికి 2005లో జ్యోతి అనే మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప […]

Advertisement
Update:2016-09-27 04:43 IST
కాపురాల్లో రేగే క‌ల‌త‌ల‌ను టీవీల్లో లోకానికి తెలియ‌జేస్తూ పంచాయ‌తీలు చేస్తున్నారంటూ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న బతుకు జ‌ట్కా బండి కార్య‌క్ర‌మం ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకుంది. త‌న‌ను బ‌త‌కు జ‌ట్కాబండి కార్య‌క్ర‌మానికి రావాలంటూ ఈ కార్య‌క్ర‌మం ప్ర‌యోక్త‌ జీవిత రాజ‌శేఖ‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఓ వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటో డ్రైవర్‌. ఇత‌నికి 2005లో జ్యోతి అనే మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప సంపూర్ణ (9) ఉంది. రెండో కాన్పు స‌మ‌యంలో జ్యోతికి టీబీ వ్యాధి వ‌చ్చింది. దీంతో ఆమెకు బిడ్డ పుట్టి చ‌నిపోయాడు. అనారోగ్యం కార‌ణంగా కొంత‌కాలంగా జ్యోతి పుట్టింట్లోనే ఉంటుంది. దీంతో పెద్ద‌ల స‌మ‌క్షంలో కొండ‌- జ్యోతి విడిపోయారు. భ‌ర‌ణంగా కొండ ల‌క్ష రూపాయ‌లు జ్యోతికి చెల్లించాడు. ఈ మ‌ధ్య‌కాలంలో జ్యోతి త‌న‌కు న్యాయం చేయాల‌ని బ‌తుకు జ‌ట్కా బండి కార్య‌క్ర‌మాన్ని ఆశ్ర‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి రావాలంటూ త‌న‌పై జీవిత రాజ‌శేఖ‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కిర‌ణ్ తోపాటు మ‌రో మ‌హిళ కొండ‌కు, అత‌ని సోద‌రుడికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీంతో కొండ వారి కాల్స్‌ను రికార్డు చేసి చిల‌క‌ల‌గూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వారు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.
Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News