త్వరలో పాకిస్తాన్ పై భారత్ దాడి?
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరో బాంబు పేల్చారు. పాకిస్తాన్‌పై త్వరలోనే మోదీ ఓ నిర్ణయం తీసుకోనున్నారని ప్రకటించారు. అదేంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఉరీలో భారత సైనికులపై ఉగ్రమూకలు దాడి చేసిన ఘటనలో 18 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సుబ్రమణ్య స్వామి చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకత్తిస్తోంది. మోదీ ఒకటి చేయబోతున్నారు. అది.. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయబోతుందా? అది […]
Advertisement
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరో బాంబు పేల్చారు. పాకిస్తాన్‌పై త్వరలోనే మోదీ ఓ నిర్ణయం తీసుకోనున్నారని ప్రకటించారు. అదేంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఉరీలో భారత సైనికులపై ఉగ్రమూకలు దాడి చేసిన ఘటనలో 18 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సుబ్రమణ్య స్వామి చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకత్తిస్తోంది. మోదీ ఒకటి చేయబోతున్నారు. అది.. పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయబోతుందా? అది సంప్రదాయ యుద్ధమా? లేక పాక్షిక యుద్ధమా? ఎల్ ఓ సీలోని తీవ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తుందా? లేక లాహోర్ వరకు సైనికులు దూసుకెళ్తారా? వీటన్నింటికి త్వరలోనే సమాధానం దొరుకబోతున్నాయన్న విధంగా ఆయన మాట్లాడారు. మొత్తానికి పాకిస్తాన్ విషయంలో మోదీ సీరియస్‌గా ఉన్నారని, ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసేది మాత్రం ఖాయమని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి స్పష్టం చేశారు.
Advertisement