అమ్మో గాంధీ... రోగిని వర్షంలో వదిలేసిన సిబ్బంది
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మానవత్వం కూడా మరిచి సిబ్బంది ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన ఒక వ్యక్తి అంబులెన్స్‌లో ఆస్పత్రికి రాగా వర్షం వస్తోందంటూ సిబ్బంది లోనదాక్కున్నారు. అప్పటికే అంబులెన్స్ నుంచి స్ట్రెచర్ మీదకు పేషెంట్‌ను మార్చారు. అయితే లోనికి మాత్రం తీసుకురాకుండా అలాగే వర్షంలో వదిలేశారు. పేషెంట్ భార్య సిబ్బందిని బతిమలాడుకున్నా వారి మనసు కరగలేదు. భారీ వర్షం వస్తోందంటూ స్ట్రెచర్‌పై ఉన్న రోగిని లోనికి తీసుకొచ్చేందుకు తటపటాయించారు. […]
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మానవత్వం కూడా మరిచి సిబ్బంది ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన ఒక వ్యక్తి అంబులెన్స్‌లో ఆస్పత్రికి రాగా వర్షం వస్తోందంటూ సిబ్బంది లోనదాక్కున్నారు. అప్పటికే అంబులెన్స్ నుంచి స్ట్రెచర్ మీదకు పేషెంట్‌ను మార్చారు. అయితే లోనికి మాత్రం తీసుకురాకుండా అలాగే వర్షంలో వదిలేశారు. పేషెంట్ భార్య సిబ్బందిని బతిమలాడుకున్నా వారి మనసు కరగలేదు. భారీ వర్షం వస్తోందంటూ స్ట్రెచర్‌పై ఉన్న రోగిని లోనికి తీసుకొచ్చేందుకు తటపటాయించారు. దాదాపు 20 నిమిషాల పాటు బాధితుడు కదలలేని స్థితిలో భారీ వర్షంలోనే ఉండిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఆస్పత్రి సిబ్బందిపై మండిపడుతున్నారు. అసలు వీళ్లు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Click on Image to Read: