హత విధి! పట్టిసీమకు పుష్కరాలు కూడా చేస్తారా?

చంద్రబాబు మాటలు ఈ మధ్య చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. పబ్లిసిటీ యావలో పడి  అసాధారణ ఆలోచనలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. పట్టిసీమ గురించి సోమవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… పట్టిసీమను ఇకపై కాలువ అనడం సరికాదని చెప్పారు. ఇక ముందు పట్టిసీమను నదిగా పిలువాలని విచిత్రమైన ఆదేశం ఇచ్చారు. పోలవరం కుడికాలువను పట్టుకుని నది అని పిలవడం ఏమిటని అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే అక్కడున్నది చంద్రబాబు […]

Advertisement
Update:2016-09-20 05:28 IST

చంద్రబాబు మాటలు ఈ మధ్య చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. పబ్లిసిటీ యావలో పడి అసాధారణ ఆలోచనలు చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. పట్టిసీమ గురించి సోమవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… పట్టిసీమను ఇకపై కాలువ అనడం సరికాదని చెప్పారు. ఇక ముందు పట్టిసీమను నదిగా పిలువాలని విచిత్రమైన ఆదేశం ఇచ్చారు. పోలవరం కుడికాలువను పట్టుకుని నది అని పిలవడం ఏమిటని అధికారులు ఆశ్చర్యపోయారు. అయితే అక్కడున్నది చంద్రబాబు కదా బయటపడకుండా మౌనంగా ఉండిపోయారు. చంద్రబాబు చెప్పడం అదో అద్భుతమన్నట్టు ఆయన పత్రికలు అచ్చేయడం జరిగిపోయింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా వైఎస్ హయాంలో తవ్విన పోలవరం కుడికాలవ ద్వారానే ఇప్పుడు పట్టిసీమకు నీరు వెళ్తోంది. ఆ కాలువను పట్టుకుని నది అనడం ఏమిటని అధికారులు నవ్వుకుంటున్నారు. చూస్తుంటే వ్యవహారం ఏదో తేడాగా ఉందనుకుంటున్నారు.

ఒక పెద్ద కాలువ తవ్వేసి దాని ద్వారా నీటిని సరఫరా చేస్తే అది నది అయిపోతుందా అని తలపట్టుకుంటున్నారు. చూస్తుంటే సోకాల్డ్‌ పట్టిసీమ నదికి చంద్రబాబు పుష్కరాలు కూడా చేసేలా ఉన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు కదా ఆ పని కూడా చేసినా ఆశ్చర్యం లేదని అధికారులే ఒక అంచనాకు వస్తున్నారు. ఆ పేరుతో మరో 1500 కోట్లు ఖర్చుపెట్టి టీడీపీ నేతల ఇంట పంట పండించినా ఆశ్చర్యం లేదంటున్నారు. పట్టిసీమ ”నది”ని సృష్టించిన చంద్రబాబుకు ” ఫాదర్ ఆఫ్ పట్టిసీమ, కలియుగ భగీరథ” అని బిరుదు కూడా ఇస్తే ఇంకా బాగుంటుందంటున్నారు. చంద్రబాబు ఈ మధ్య ఆ పత్రిక యజమాని మాటలు ఎక్కువగా వింటూ ఇలా తయారయ్యారని అధికారులు వాపోతున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News