నయీం డంప్ ల వద్ద శేషన్న కాపలా!
అమాయకులను బెదిరించి, హత్యలు చేసి సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బును నయీం డంప్‌ల్లో దాచాడా? ఆ వివరాలు ఎవరికి తెలుసు? ఇంకెవరికి నయీంతో 30 ఏళ్లుగా కలిసి తిరుగుతున్న మాజీ మావోయిస్టు శేషన్నకే! నయీం ఎన్‌కౌంటర్‌లో హతమైన తరువాత నుంచి అతని కుడిభుజం శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా ఇంతవరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. శేషన్న కోసం ఇప్పటికే చత్తీస్‌ఘడ్, ఒడిశా, మహారాష్ట్రల్లో పోలీసులు గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా […]
Advertisement
అమాయకులను బెదిరించి, హత్యలు చేసి సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బును నయీం డంప్‌ల్లో దాచాడా? ఆ వివరాలు ఎవరికి తెలుసు? ఇంకెవరికి నయీంతో 30 ఏళ్లుగా కలిసి తిరుగుతున్న మాజీ మావోయిస్టు శేషన్నకే! నయీం ఎన్‌కౌంటర్‌లో హతమైన తరువాత నుంచి అతని కుడిభుజం శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా ఇంతవరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు. శేషన్న కోసం ఇప్పటికే చత్తీస్‌ఘడ్, ఒడిశా, మహారాష్ట్రల్లో పోలీసులు గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శేషన్న అతని నలుగురు అనుచరులతో కలిసి పరారీలో ఉన్నారు. ఇప్పుడు శేషన్న ఎక్కడ ఉన్నాడు? నయీం డెన్ ల వద్దే కాపలా కాస్తున్నాడా? లేక వాటిని మరో చోటికి తరలించే ప్రయత్నం చేస్తున్నాడా? ఇప్పుడు పోలీసులను వేధిస్తోన్న ప్రశ్నలివే.
నయీం హతమైన తరువాత విడుదలైన లేఖ, కొందరికి వచ్చిన బెదిరింపు లేఖలు శేషన్న అతని అనుచరుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శేషన్న అతని అనుచరులు తెలంగాణ- ఏపీ సరిహధ్దు లోని నల్లమల అటవీప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారి కోసం కూంబింగ్ మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో అనేక అరాచకాలకు పాల్పడ్డ నయీం.. అమాయకుల నుంచి అన్యాయంగా లాక్కున్న డబ్బు రూ.వందల కోట్లలో ఉంటుందని సమాచారం. మావోయిస్టు నేపథ్యమున్న నయీం అంత డబ్బును తన నివాసంలో దాస్తే ప్రమాదమని నల్లమల అటవీప్రాంతంలో కొన్ని డంపుల్లో దాచి ఉంటాడని అంటున్నారు. ఎక్కడ దాచిపెట్టాడో ఒక శేషన్నకి మాత్రమే తెలిసి ఉంటుంది. నయీం ఎన్‌కౌంటర్ జరిగి నెలన్నరోజులు దాటింది. అయినా శేషన్న ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. ఈ మధ్యకాలంలో శేషన్న ఆ డంపులను మరోచోటికి తరలించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తరలించిన డంపులు ఎక్కడున్నాయో.. వాటికి సమీపంలోనే శేషన్న కాపలా ఉండే అవకాశముంటుంది. అందుకే, పోలీసులు నల్లమల అటవీప్రాంతాన్ని జల్లెడ పట్టనున్నారు.
Advertisement