మరింత కట్టుదిట్టంగా అమిత్‌షా ప్రసంగం!
తెలంగాణ బీజేపీ స్థానికంగా బలపడే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచనం జరపాలన్న డిమాండ్‌తో ముందుకుపోతోంది. తెలంగాణలో బలపడే అవకాశాలు ఉన్నందున అమిత్‌షా కూడా రాష్ట్ర కేడర్‌కు మద్దతు పలుకుతున్నారు. మొన్న సూర్యాపేట సభకు హాజరైన అమిత్‌షా నేడు వరంగల్ సభకూ ముఖ్యఅతిథిగా రానున్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జరిగే సభలో అమిత్ షా ప్రసంగాన్ని మరింత కట్టుదిట్టంగా తయారు చేస్తున్నారు. గతంలో జూన్‌లోనూ సూర్యాపేటలో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు […]
Advertisement
తెలంగాణ బీజేపీ స్థానికంగా బలపడే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచనం జరపాలన్న డిమాండ్‌తో ముందుకుపోతోంది. తెలంగాణలో బలపడే అవకాశాలు ఉన్నందున అమిత్‌షా కూడా రాష్ట్ర కేడర్‌కు మద్దతు పలుకుతున్నారు. మొన్న సూర్యాపేట సభకు హాజరైన అమిత్‌షా నేడు వరంగల్ సభకూ ముఖ్యఅతిథిగా రానున్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జరిగే సభలో అమిత్ షా ప్రసంగాన్ని మరింత కట్టుదిట్టంగా తయారు చేస్తున్నారు. గతంలో జూన్‌లోనూ సూర్యాపేటలో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా చేసిన ప్రసంగంలో చాలా తప్పులు దొర్లడంతో ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ విషయంలో అమిత్‌షా ప్రసంగాన్ని రాష్ట్ర నేతలే తయారు చేశారని ప్రచారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో అత్యుత్సాహానికి పోయిన తెలంగాణ బీజేపీ నేతలు యధార్థ విషయాలను పక్కన బెట్టి ఊకదంపుడు ప్రసంగాలకోసం ఉన్నవి లేనివి కలిపి చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో వేదికపై ప్రసంగించిన అమిత్‌షా తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడ కుటుంబ పాలన సాగుతోందని, కేంద్రం రూ.90 కోట్లు ఇచ్చిందని గొప్పలు చెప్పాడు. ఆ నిధులతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోంది తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అంతసీన్ లేదన్నారు.
అమిత్‌షా చెప్పిన విషయాలు దాదాపు అవాస్తవాలే! ఆయన మాటలతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇన్ని నిధులు నిజంగానే కేంద్రం ఇచ్చిందా? ఇస్తే ఎక్కడికిపోయాయి? అన్న చర్చ మొదలైంది. దీనిపై తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. రూ.90 కోట్లు ఎప్పుడు, ఎక్కడ మంజూరు చేశారో లెక్కలు చూపాలని సవాలు విసిరారు. ఈ రెండు సంవత్సరాల్లో కేవలం 36 వేల కోట్లను మాత్రమే కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని గణాంకాలు చదివి వినిపించారు. రాష్ట్రాలు కేంద్రానికి వేల కోట్ల నిధులు చెల్లిస్తున్నాయని రాష్ట్రాలు కేంద్రాన్ని భిక్షమెత్తుకోవని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్రం మోడీ మెచ్చుకుంటుంటే అమిత్‌షా మాత్రం విమర్శలు చేయడం ద్వంద వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈటెల కౌంటర్‌తో అమిత్‌షాకు పరువు పోయినంత పనైంది. ఈటెల మాటలు బీజేపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయింది. తిరిగి ఈటెలకు సమాధానం చెప్పలేక మౌనాన్నే ఆశ్రయించారు. ఈసారి ఎవరికీ దొరక్కుండా అమిత్‌షా ప్రసంగం ఉండేలా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం.
Advertisement