108 డ్రైవర్లకు గుడ్ న్యూస్..జీతాలు పెంపు

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

Advertisement
Update:2024-12-28 20:25 IST

 ఏపీలో 108, 104 సేవలకు ఇకపై సింగిల్ సర్వీస్ ప్రొడర్‌ను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 190 నూతన 108 వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ. 4వేలు ఇవ్వాలని సూచించారు. ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. హెల్త్ డిపార్ట్మెంట్ పెండింగ్‌లో ఉన్న సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. మంత్రి సత్య కుమార్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News