లంచ్‌ బ్రేక్‌.. ఆసీస్‌ 53/2

ప్రస్తుతం ఆసీస్‌ 158 రన్స్‌ ఆధిక్యం

Advertisement
Update:2024-12-29 07:35 IST

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా-భారత్‌ నాలుగో టెస్ట్‌ నాలుగో రోజు తొలి సెషన్‌ ముగిసింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 53 రన్స్‌ చేసింది. క్రీజులో మార్నస్‌ లబుషేన్‌ (20*), స్టీవ్‌ స్మిత్‌ (2*) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజా (21), స్టామ్‌ కోన్‌స్టాస్‌ (8) పెవిలియన్‌కు చేరారు. కొన్‌స్టాను బూమ్రా.. ఖవాజాను సిరాజ్‌ క్లీన్‌బౌల్డ్ చేశారు. ప్రస్తుతం ఆసీస్‌ 158 రన్స్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నది. మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ 474, టీమిండియా 369 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News