సబ్బం హరికి రూట్ క్లియర్? ఆ కామెంట్స్ దేనికి నిదర్శనం?

ఒక తెలుగు న్యూస్ ఛానల్‌ వెంకయ్యనాయుడితో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ సబ్బంహరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి స్వచ్చందంగా సమీకరించడం భారత దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ప్రధానికి కూడా సాధ్యం కాదని కితాబిచ్చారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా కొందరు రైతులు మరో వెయ్యి ఎకరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తే అక్కడికి వెళ్లి జెండాలు పాతి ఆందోళనలు చేయడం ఏమిటని ప్రతిపక్షాలను సబ్బం ప్రశ్నించారు. […]

Advertisement
Update:2016-09-12 02:39 IST

ఒక తెలుగు న్యూస్ ఛానల్‌ వెంకయ్యనాయుడితో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ సబ్బంహరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మాట్లాడారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి స్వచ్చందంగా సమీకరించడం భారత దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ప్రధానికి కూడా సాధ్యం కాదని కితాబిచ్చారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా కొందరు రైతులు మరో వెయ్యి ఎకరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తే అక్కడికి వెళ్లి జెండాలు పాతి ఆందోళనలు చేయడం ఏమిటని ప్రతిపక్షాలను సబ్బం ప్రశ్నించారు.

రాజధాని కడితే అడ్డుకోవడం, భోగాపురంలో ఎయిర్‌పోర్టు కడుతామంటే అడ్డుకోవడం, బందర్ పోర్టు నిర్మిస్తుంటే అడ్డుకోవడం .. ఇలా ఇది సరైన పద్దతి కాదన్నారు. ఎన్నికల వరకూ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని సబ్బం ఆరోపించారు. పైగా పెట్టుబడి లేకుండా రాజధాని కట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా వచ్చే నష్టం ఏమిటని సబ్బంహరి ప్రశ్నించారు.

విశాఖ జోన్‌పై సబ్బం కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ జోన్ సాధ్యం కాదని తాను అప్పట్లోనే చెప్పానన్నారు. విశాఖ ఆదాయం ప్రస్తుతం ఈస్ట్‌ కోస్ట్‌కు వెళ్తోందని ఇప్పుడు విశాఖను జోన్‌గా చేస్తే ఈస్ట్‌ కోస్ట్ ఎత్తివేయాల్సి ఉంటుందన్నారు. జోన్ల ఏర్పాటు రాజకీయమేనన్నారు. ఏపీకి మాత్రం ఒక జోన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సబ్బం హరి. కొత్త రైల్వే జోన్‌ను విశాఖలో కాకుండా విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్న వేళ విశాఖజిల్లాకు చెందిన సబ్బం హరి విశాఖలో జోన్‌ సాధ్యం కాదని వ్యాఖ్యానించడం ఏమిటో?. బాబును సబ్బం ఆకాశానికి ఎత్తేయడం బట్టి చూస్తుంటే ఆయన టీడీపీలో చేరుతారనిపిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News