భూమనను అరెస్ట్ చేయకపోవడానికి కారణం అదేనా?
తుని కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. రెండో రోజు విచారణ పూర్తి చేసుకుని భూమన బయటకు వచ్చారు. అంతకు ముందు సీఐడీ కార్యాలయం వద్ద పెద్దెత్తున హడావుడి కనిపించింది. పోలీసులు రావడం, వైసీపీ శ్రేణులు అటువైపు రాకుండా అడ్డుకోవడం బట్టి చూసి భూమనను అరెస్ట్ చేస్తారని భావించారు. చెవిరెడ్డి కూడా అదే తరహాలో మాట్లాడారు. అయితే అలా జరగలేదు. భూమనను అరెస్ట్ చేస్తే అది రాజకీయంగా వైసీపీకే లాభం […]
తుని కేసులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. రెండో రోజు విచారణ పూర్తి చేసుకుని భూమన బయటకు వచ్చారు. అంతకు ముందు సీఐడీ కార్యాలయం వద్ద పెద్దెత్తున హడావుడి కనిపించింది. పోలీసులు రావడం, వైసీపీ శ్రేణులు అటువైపు రాకుండా అడ్డుకోవడం బట్టి చూసి భూమనను అరెస్ట్ చేస్తారని భావించారు. చెవిరెడ్డి కూడా అదే తరహాలో మాట్లాడారు. అయితే అలా జరగలేదు. భూమనను అరెస్ట్ చేస్తే అది రాజకీయంగా వైసీపీకే లాభం అవుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వెనక్కుతగ్గినట్టు భావిస్తున్నారు. కాపుల కోసం భూమన కరుణాకర్ రెడ్డి జైలుకువెళ్లినట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉంటుందని అదే జరిగితే కాపులకు వైసీపీ మీద అభిమానం పెరగవచ్చన్న భావనతోనే ప్రభుత్వం అరెస్ట్‌పై వెనక్కు తగ్గినట్టు భావిస్తున్నారు. అయితే భూమనను అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని విచారణాధికారి చెప్పారు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి… కుట్రలు, కుతంత్రాలు, వంచనతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎదిగారని మండిపడ్డారు. తనపై కక్షతోనే తుని ఘటనలో నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. విచారణాధికారులు హరికృష్ణ, భాస్కర్ చాలా సంస్కారవంతంగా, సభ్యతతో విచారణ చేశారన్నారు. తనను వారు ఏమాత్రం నొప్పించలేదని అందుకు వారిని అభినందిస్తున్నానన్నారు. తాను నేరం చేసినట్టుగా సీఐడీ అధికారులు చెప్పలేదన్నారు. తుని ఘటనపై సీబీఐ విచారణ లేదా, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయిస్తే నిజానిజాలు నిగ్గుతేలుతాయన్నారు భూమన.
Click on Image to Read: