ఈ ఫొటోపై వెంకయ్య వివరణ

దూబకుంట రోశమ్మ. సారా వ్యతిరేక ఉద్యమకారినిగా ఆమెకు పేరుంది. ఈ మధ్యే అనారోగ్యంతో చనిపోయారు. ఆమె చనిపోయిన సమయంలో ఒక పత్రిక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. గతంలో రోశమ్మ అనారోగ్యానికి గురైన సమయంలో వెంకయ్య ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ. 50వేలు ఆమెకు సాయం చేశారు. అయితే దీనిపై ఒకప్రముఖ పత్రిక కథనాన్ని అప్పట్లో ప్రచురించింది. రోశమ్మకు రూ. 50వేల చెక్‌ ఇప్పించిన వెంకయ్య ఆ విషయాన్ని మీడియాలో ప్రచారం చేయించుకున్నారని.. […]

Advertisement
Update:2016-09-05 09:12 IST

దూబకుంట రోశమ్మ. సారా వ్యతిరేక ఉద్యమకారినిగా ఆమెకు పేరుంది. ఈ మధ్యే అనారోగ్యంతో చనిపోయారు. ఆమె చనిపోయిన సమయంలో ఒక పత్రిక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. గతంలో రోశమ్మ అనారోగ్యానికి గురైన సమయంలో వెంకయ్య ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ. 50వేలు ఆమెకు సాయం చేశారు. అయితే దీనిపై ఒకప్రముఖ పత్రిక కథనాన్ని అప్పట్లో ప్రచురించింది.

రోశమ్మకు రూ. 50వేల చెక్‌ ఇప్పించిన వెంకయ్య ఆ విషయాన్ని మీడియాలో ప్రచారం చేయించుకున్నారని.. కానీ ఆ తర్వాత చెక్‌ ఎందుకులే నేరుగా డబ్బే ఇస్తానంటూ వెనక్కు తీసుకున్నారన్నది పత్రిక కథనం. అలా చెక్‌ను వెనక్కు తీసుకుని ఆ తర్వాత రోశమ్మకు కనిపించలేదని ఫొటోతో సహా కథనాన్ని రాసింది. రోశమ్మ చనిపోయిన సమయంలో ఈ పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో బాగా తిరిగింది. నెటిజన్లు వెంకయ్యను తిట్టిపోశారు. సాయం చేసి వెనక్కు తీసుకోవడం ఏమిటని మండిపడ్డారు. అయితే ఈ విషయం వెంకయ్యనాయుడు వరకు వెళ్లింది. అందుకు సోమవారం ఒక పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.

దూబగుంట రోశమ్మ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు కలచివేశాయని చెప్పారు. రోశమ్మకు అరోగ్యం బాగోలేదని తెలిసి ఢిల్లీలో ఉన్న తాను స్థానిక నాయకులకు ఫోన్ చేసి రూ. 50వేలు ఇవ్వాల్సిందిగా చెప్పానన్నారు. అయితే రూ. 50వేలు చెక్కు ఇచ్చి వెనక్కు తీసుకున్నారని ఒక పత్రిక రాయడం బాధకలిగించిందన్నారు. అయితే నిప్పులేనిది పొగ రాదు కదా?. బహుశా వెంకయ్య ఆదేశాల మేరకు సాయం చేసిన వ్యక్తులే తిరిగి చెక్‌ను వెనక్కు తీసుకెళ్లారేమో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News