ఈ ఏడాది కాశ్మీరీ యాపిల్స్‌ మనదాకా రాకపోవచ్చు...

కాశ్మీర్‌ యాపిల్స్‌ సీజన్‌ ప్రారంభమైంది. యాపిల్స్‌ దిగుబడి బాగుంది. కానీ చెట్లనుంచి యాపిల్స్‌ కోసి భారతదేశం నలువైపులకు పంపించే పరిస్థితి లేదు. దాదాపు రెండు నెలలనుంచి కాశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతుండడంతో చెట్లకు విరగకాసిన యాపిల్స్‌ను చెట్లనుంచి కోసి ఎగుమతిచేసే వాళ్లు కరువయ్యారు. కొన్నిచోట్ల చెట్లమీదనే యాపిల్స్‌ పండి రాలిపోతున్నాయి. ఇప్పుడు రోజుకు సుమారు 100 లారీలదాకా యాపిల్స్‌ కాశ్మీర్‌ నుంచి ఢిల్లీ మండీలకు వస్తున్నాయి. అయితే మార్గ మధ్యంలో సెక్యూరిటీ సిబ్బంది తరచూ లారీలను ఆపడం, గంటల […]

Advertisement
Update:2016-09-04 02:30 IST

కాశ్మీర్‌ యాపిల్స్‌ సీజన్‌ ప్రారంభమైంది. యాపిల్స్‌ దిగుబడి బాగుంది. కానీ చెట్లనుంచి యాపిల్స్‌ కోసి భారతదేశం నలువైపులకు పంపించే పరిస్థితి లేదు. దాదాపు రెండు నెలలనుంచి కాశ్మీర్‌లో కర్ఫ్యూ కొనసాగుతుండడంతో చెట్లకు విరగకాసిన యాపిల్స్‌ను చెట్లనుంచి కోసి ఎగుమతిచేసే వాళ్లు కరువయ్యారు. కొన్నిచోట్ల చెట్లమీదనే యాపిల్స్‌ పండి రాలిపోతున్నాయి.

ఇప్పుడు రోజుకు సుమారు 100 లారీలదాకా యాపిల్స్‌ కాశ్మీర్‌ నుంచి ఢిల్లీ మండీలకు వస్తున్నాయి. అయితే మార్గ మధ్యంలో సెక్యూరిటీ సిబ్బంది తరచూ లారీలను ఆపడం, గంటల తరబడి నిలిపివేయడం వల్ల కొన్ని లారీల్లో యాపిల్స్‌ చెడిపోతున్నాయని కాశ్మీరీ రైతులు బాధపడుతున్నారు.

కాశ్మీర్‌లో యాపిల్‌ సీజన్‌ నిజానికి సెప్టెంబర్‌ రెండవ వారం నుంచి ప్రారంభం అవుతుంది. రోజుకు ఎనిమిది, తొమ్మిది వందల లారీల యాపిల్స్‌ను ఢిల్లీవైపు పంపిస్తారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. కారణం ఏమిటంటే ఆగష్టు నెలాఖరునుంచే ఢిల్లీ ఫ్రూట్‌ మండీల దళారులు కాశ్మీర్‌కు వెళ్లి కొనుగోళ్లు ప్రారంభిస్తారు. కాశ్మీర్‌లో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులవల్ల ఢిల్లీ ఫ్రూట్‌ మండీల దళారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. దాంతో ఎగుమతులు పెద్దగా ఉండకపోవచ్చునని కాశ్మీరీ రైతులు బాధపడుతున్నారు. యాపిల్స్‌తోపాటు బేరీ పండ్ల ఎగుమతులు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఆగష్టు నెలలో కొన్ని వందల లారీల బేరీ పండ్లు మార్గ మధ్యంలో చెడిపోయాయి.

ప్రతి ఏడాది కాశ్మీర్‌నుంచి ఈ పండ్ల ఎగుమతుల వల్ల ఆ రాష్ట్రానికి సుమారు రూ. 900ల కోట్ల ఆదాయం వచ్చేది. ఈ ఏడాది అందులో నాలుగవ వంతు వస్తుందన్న నమ్మకం లేదు.

Tags:    
Advertisement

Similar News