జమ్ముకశ్మీర్‌కి అఖిల పక్ష బృందం.... గోడలను శుభ్రం చేసే పనిలో అధికారులు!
జమ్ముకశ్మీర్‌లో ఆదివారం నుండి రెండురోజుల పాటు అఖిల పక్ష నాయకుల బృందం పర్యటించబోతోంది. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్టా… పలు అంశాలపై జమ్ము కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రతినిధులతో వీరు చర్చలు జరుపుతారు. అయితే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ ఏర్పాట్లలో ఉండగా …మరొక పక్క శ్రీనగర్‌లో.. శుక్రవారం రాత్రి నుండే అధికారులు మరొక హడావుడిలో ఉన్నారు. రోడ్లు బిల్డింగుల శాఖ, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు డబ్బాలకొద్దీ పెయింట్‌లను వీధుల్లోకి పంపుతున్నారు. గోడలమీద […]
జమ్ముకశ్మీర్‌లో ఆదివారం నుండి రెండురోజుల పాటు అఖిల పక్ష నాయకుల బృందం పర్యటించబోతోంది. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్టా… పలు అంశాలపై జమ్ము కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రతినిధులతో వీరు చర్చలు జరుపుతారు. అయితే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ ఏర్పాట్లలో ఉండగా …మరొక పక్క శ్రీనగర్‌లో.. శుక్రవారం రాత్రి నుండే అధికారులు మరొక హడావుడిలో ఉన్నారు.
రోడ్లు బిల్డింగుల శాఖ, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు డబ్బాలకొద్దీ పెయింట్‌లను వీధుల్లోకి పంపుతున్నారు. గోడలమీద రెచ్చగొట్టేవిధంగా ఉన్న స్లోగన్లు, జెండాలు, యాంటీ ఇండియా గ్రాఫిటీలను తుడిచేసే ఏర్పాట్లు చేస్తున్నారు. గో ఇండియా…గో బ్యాక్, బర్హన్ వానీ మా హీరో….అనే స్లోగన్లు… హోం మంత్రి ఆధ్వర్యంలో అఖిల పక్ష బృందం పర్యటించే ప్రాంతంలోనే కనబడుతున్నాయి. బర్హన్ వానీ రేఖా చిత్రాలను గోడలమీద, షాపుల షట్లర్లమీద విస్తృతంగా చిత్రించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు కలిసి వీటిలో చాలా వాటిని తుడిచేయించగలిగారు.