నేను వైస్రాయిని కాను... వైఎస్‌ మృతితోనే ఆయనకు జీవితం

తాను భారత్‌, పాకిస్తాన్‌ను విడదీసిన వైస్రాయిని కానని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చెప్పారు. రాష్ట్ర విభజన ఫలాలు రానున్న ఐదు, పదేళ్లలో ప్రజలకు అందుతాయన్నారు. ఏపీ విభజన పరిణామాలపై జైరాం రాసిన ”ఓల్డ్ హిస్టరీ.. న్యూ జియోగ్రఫి” పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జైరాం రమేష్… 2009 వరకు తెలంగాణ సెంటిమెంట్ కొందరు ప్రజలు,నాయకుల్లో మాత్రమే ఉండేదని… కానీ వైఎస్ మరణంతో అది మరింత బలపడిందన్నారు. వైఎస్‌ఆర్‌ మరణం వల్లే […]

Advertisement
Update:2016-09-04 02:10 IST

తాను భారత్‌, పాకిస్తాన్‌ను విడదీసిన వైస్రాయిని కానని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చెప్పారు. రాష్ట్ర విభజన ఫలాలు రానున్న ఐదు, పదేళ్లలో ప్రజలకు అందుతాయన్నారు. ఏపీ విభజన పరిణామాలపై జైరాం రాసిన ”ఓల్డ్ హిస్టరీ.. న్యూ జియోగ్రఫి” పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జైరాం రమేష్… 2009 వరకు తెలంగాణ సెంటిమెంట్ కొందరు ప్రజలు,నాయకుల్లో మాత్రమే ఉండేదని… కానీ వైఎస్ మరణంతో అది మరింత బలపడిందన్నారు. వైఎస్‌ఆర్‌ మరణం వల్లే కేసీఆర్‌కు రాజకీయంగా కొత్త జీవితం అందిందన్నారు. అప్పటి వరకు మనుగడ లేని పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌కు వైఎస్‌ మరణంతో జీవం వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ ఒక పాస్‌పోర్టు స్కామ్‌ల పార్టీ అని జైరాం అభివర్ణించారు. కేసీఆర్‌ చేసిన దీక్ష గాంధీ, పొట్టిశ్రీరాములు చేసిన సత్యాగ్రహం లాంటిది కాదన్నారు. వైద్యుల పర్యవేక్షణలో, ఏసీ గదుల్లో కేసీఆర్‌ దీక్ష కొనసాగిందని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News