తండ్రే కాదు... కొడుకూ అలాగే తయారయ్యాడు..

రాయలసీమకు సాగు నీరు ఇవ్వాలంటూ కడపలో జగన్ మహా ధర్నా నిర్వహించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా చంద్రబాబు మాటలు చెబుతున్నారే గానీ రాయలసీమకు నీరు ఇవ్వడం లేదని జగన్ విమర్శించారు. అసలు రాయలసీమలో కరువు ఉన్న విషయమే తన దృష్టికి రాలేదంటూ చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సింగపూర్‌కు అమరావతి భూములు ఎలా కట్టెబట్టాలో మాత్రమే చంద్రబాబుకు తెలిసినట్టుగా ఉందన్నారు. శ్రీశైలంలో నీరు ఉన్నా రాయలసీమకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి సీఎంను పిచ్చిఆస్పత్రిలో […]

Advertisement
Update:2016-09-03 08:58 IST

రాయలసీమకు సాగు నీరు ఇవ్వాలంటూ కడపలో జగన్ మహా ధర్నా నిర్వహించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా చంద్రబాబు మాటలు చెబుతున్నారే గానీ రాయలసీమకు నీరు ఇవ్వడం లేదని జగన్ విమర్శించారు. అసలు రాయలసీమలో కరువు ఉన్న విషయమే తన దృష్టికి రాలేదంటూ చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సింగపూర్‌కు అమరావతి భూములు ఎలా కట్టెబట్టాలో మాత్రమే చంద్రబాబుకు తెలిసినట్టుగా ఉందన్నారు.

శ్రీశైలంలో నీరు ఉన్నా రాయలసీమకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదిలేస్తున్నారన్నారు. ఇలాంటి సీఎంను పిచ్చిఆస్పత్రిలో పెట్టాలో లేక బంగాళాఖాతంలో వేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కడపలోని ఆర్డీపీపీ మూతపడితే ఆనందపడేది చంద్రబాబు మాత్రమేనన్నారు. అలా మూతపడితే దాన్ని కూడా సింగపూర్‌ కంపెనీకి అప్పగించవచ్చని చంద్రబాబు ఆలోచన చేస్తారన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ సాధించారన్నారు. చంద్రబాబే అనుకుంటే ఆయన కుమారుడు లోకేష్ కూడా అలాగే తయారయ్యాడన్నారు. ఏ తండ్రి అయినా కొడుకుకి మంచిగా ఉంటూ గౌరవంగా బతుకు, మోసం చేయవద్దు అని చెబుతారని… చంద్రబాబు మాత్రం రైతులను, జనాలను ఎలా మోసం చేయాలన్నది లోకేష్‌కు నేర్పిస్తున్నారని జగన్ విమర్శించారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీపై తండ్రి ఒకలా, కొడుకు ఒకలా మాట్లాడుతున్నారన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేయడం చూశామని… కానీ కరువుపైన ఏరియల్ సర్వే చేసిన వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు. చంద్రబాబు పాలన మొత్తం అబద్దాలు, దుర్మార్గాలు, మోసాలు, వెన్నుపోట్లేనని జగన్‌ విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News