స‌మంత  ఆ విష‌యాలు భ‌రించ‌ లేకపోతుందా..!

రూమ‌ర్స్   ఇండ‌స్ట్రీలో  కామ‌న్.  అయితే  హీరోయిన్స్  మీద మాత్రం భ‌రించ‌లేనంత‌గా వ‌స్తుంటాయి.   ఇక టాప్ హీరోయిన్స్  విష‌యంలో అయితే మ‌రీను. వాళ్లు  ఏది చేసినా న్యూసే.   వాళ్ల‌కంటూ ప‌ర్సన‌ల్  లైఫ్ ఉంటుంది అనేది కూడా  ఆలోచ‌న ఉండ‌దు గాసిప్ రాయుళ్ల‌కు.  క‌ట్ చేస్తే    స‌మంత  విష‌యంలో   పుట్టిన‌న్ని గాసిప్స్ ఇంత వ‌ర‌కు ఎవరిమీద  పుట్ట‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. త‌ను ఏ విష‌యం మాట్లాడినా దానికి చిలువ‌లు ప‌లువ‌లు చేసి రాస్తుంటారు.  తాను ఒక‌టి చెబితే గాసిప్ రాయుళ్లు […]

Advertisement
Update:2016-09-03 11:32 IST

రూమ‌ర్స్ ఇండ‌స్ట్రీలో కామ‌న్. అయితే హీరోయిన్స్ మీద మాత్రం భ‌రించ‌లేనంత‌గా వ‌స్తుంటాయి. ఇక టాప్ హీరోయిన్స్ విష‌యంలో అయితే మ‌రీను. వాళ్లు ఏది చేసినా న్యూసే. వాళ్ల‌కంటూ ప‌ర్సన‌ల్ లైఫ్ ఉంటుంది అనేది కూడా ఆలోచ‌న ఉండ‌దు గాసిప్ రాయుళ్ల‌కు. క‌ట్ చేస్తే స‌మంత విష‌యంలో పుట్టిన‌న్ని గాసిప్స్ ఇంత వ‌ర‌కు ఎవరిమీద పుట్ట‌లేదంటే అతిశ‌యోక్తి కాదు.

త‌ను ఏ విష‌యం మాట్లాడినా దానికి చిలువ‌లు ప‌లువ‌లు చేసి రాస్తుంటారు. తాను ఒక‌టి చెబితే గాసిప్ రాయుళ్లు ఇంకొటి చెబుతారు. మొత్తం మీద ఎంత తేలిగ్గా తీసుకొన్నా కొన్నిసార్లు బాధ కలుగుతోందని, స్పందించినా, స్పందించకపోయినా వేరే అర్థాలు తీస్తున్నారని వాపోతోంది. ‘‘నాపై వచ్చిన ప్రతీ వార్తకూ నేను స్పందించలేను. కొన్నింటిని అస్సలు పట్టించుకోను. పట్టించుకోకపోతే కొత్తగా ఇంకొన్ని పుట్టుకొస్తాయి. అందుకే మాట్లాడాల్సివస్తోంది. ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మామూలే అనుకొంటే కొంత స్వాంతన కలుగుతుంది. కాకపోతే ఒక్కోసారి భరించలేకపోతున్నా’’ అంటోంది. పాపం స‌మంత‌..

Tags:    
Advertisement

Similar News