యూనివర్శిటీలో...అమ్మాయిల వాష్‌రూములో ఫోన్ కెమెరా!
కర్ణాటకలోని మంగళూరు యూనివర్శిటీలో ఆడపిల్లల వాష్ రూములో గుర్తుతెలియని వ్యక్తులు కెమెరాని ఉంచడంతో యూనివర్శిటీలో కలకలం రేగింది. విద్యార్థినులు దీనిపై ఆందోళన వ్యక్తం చేయటంతో యూనివర్శిటీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళితే గత నెల 24న యూనివర్శిటిలోని బయోసైన్సెస్ బ్లాక్‌లో వాష్‌రూముకి వెళ్లిన ఒక విద్యార్థిని… పైన చెక్కలతో ఉన్న కప్పులో ఒక సెల్ఫోన్ అమర్చి ఉండటం కనుగొంది. అది పైకప్పులోంచి కిందికి చూస్తున్నట్టుగా అమర్చి ఉంది. ఆమె దాన్ని తీసి చూడగా…ఆ పోన్లో […]
కర్ణాటకలోని మంగళూరు యూనివర్శిటీలో ఆడపిల్లల వాష్ రూములో గుర్తుతెలియని వ్యక్తులు కెమెరాని ఉంచడంతో యూనివర్శిటీలో కలకలం రేగింది. విద్యార్థినులు దీనిపై ఆందోళన వ్యక్తం చేయటంతో యూనివర్శిటీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళితే గత నెల 24న యూనివర్శిటిలోని బయోసైన్సెస్ బ్లాక్‌లో వాష్‌రూముకి వెళ్లిన ఒక విద్యార్థిని… పైన చెక్కలతో ఉన్న కప్పులో ఒక సెల్ఫోన్ అమర్చి ఉండటం కనుగొంది. అది పైకప్పులోంచి కిందికి చూస్తున్నట్టుగా అమర్చి ఉంది. ఆమె దాన్ని తీసి చూడగా…ఆ పోన్లో సిమ్కార్డు తీసేసి కెమెరా ఆన్చేసి ఉంది. ఆందోళనకు గురయిన విద్యార్థిని దాన్ని బయోసైన్సెస్ డిపార్ట్మెంట్ హెడ్కి అప్పగించగా..ఆ హెడ్ దాన్ని రిజిస్ట్రార్ కె ఎమ్ లోకేష్కి అందజేశారు. ఆ తరువాత ఈ విషయంపై విచారణ చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆపై విద్యార్థినుల నుండి ఒత్తిడి ఎక్కువ కావటంతో ఈ ఘటనపై యూనివర్శిటీ అధికారులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కమిటి సేకరించిన వివరాలతో కూడిన నివేదికను కూడా పోలీసులకు అందజేశారు.
పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 354(సి), ఇనఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66 (ఇ) ప్రకారం కేసులు నమోదు చేశారు. యూనివర్శిటీ క్యాంపస్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థినులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లో రికార్డయిన దృశ్యాలు అప్పటికే కొన్ని బయటకు వెళ్లిపోయి ఉంటాయని వారు భయపడుతున్నారు. బయోసైన్సెస్ బ్లాక్లో మొత్తం 200మంది విద్యార్థులు ఉన్నారు. క్యాంపస్లోని కారిడార్లలో, మహిళల వాష్రూముకి వెళ్లే దారిలోనూ సిసిటివి కెమెరాలను ఉంచకపోవటంపై విద్యార్థినులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం రెండురోజుల క్రితం యూనివర్శిటీ అధికారులు సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యూనివర్శిటీలో మహిళా సెక్యురిటీ గార్డులు లేకపోవటంపై కూడా విద్యార్థినులు అసంతృప్తితో ఉన్నారు.
Click on Image to Read: