అప్పట్లో తుపాకులు పట్టుకుని తిరిగేవారు... నా మైండ్ ఖరాబ్ కావాలని వారి కోరిక
ప్రతిపక్ష నేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఉన్మాదిలా తయారయ్యాడని విమర్శించారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు అక్కడి బహిరంగసభలో ప్రసంగించారు. అభివృద్ధి కోసం అందరూ మారినా ఈ జిల్లాలోని ఉన్మాది మాత్రం మారడం లేదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను ప్రగతి యజ్ఞం చేస్తుంటే … సదరు ఉన్మాది రాక్షసుడిలా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో తనంతటి సీనియర్ నాయకుడు లేడని… దేవేగౌడ, గుజ్రాల్‌ను ప్రధానులుగా, కేఆర్ నారాయణన్, అబ్దుల్ […]
ప్రతిపక్ష నేత జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఉన్మాదిలా తయారయ్యాడని విమర్శించారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు అక్కడి బహిరంగసభలో ప్రసంగించారు. అభివృద్ధి కోసం అందరూ మారినా ఈ జిల్లాలోని ఉన్మాది మాత్రం మారడం లేదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాను ప్రగతి యజ్ఞం చేస్తుంటే … సదరు ఉన్మాది రాక్షసుడిలా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో తనంతటి సీనియర్ నాయకుడు లేడని… దేవేగౌడ, గుజ్రాల్‌ను ప్రధానులుగా, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంలను రాష్ట్రపతులుగా నియమించిన ఘనత తనదేనన్నారు. అలాంటి వాడిని చెప్పులతో కొట్టండి అని జగన్ పిలుపునివ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల కోసమే ఉన్మాది వ్యాఖ్యలను భరించానన్నారు.
రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు పట్టిసీమ కడుతుంటే జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పట్టిసీమ కాల్వకు గండి కొట్టింది కూడా జగన్ వర్గమేనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒకప్పుడు కడప జిల్లాలో రౌడీలు తుపాకులు పట్టుకుని తిరిగేవారని… పంటలతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాను వచ్చానని చెప్పారు. తన మైండ్ ఖరాబ్ కావాలని కొందరు కోరుకుంటున్నారని విమర్శించారు. కానీ తాను ఎవ్వరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు.
Click on Image to Read: