అది జరిగితేనే చంద్రబాబు కథ కూడా తేలుతుంది...

ఓటుకు నోటు కేసులోని ఆడియో టేపుల్లో ఉంది చంద్రబాబు వాయిసేనని నటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ చెప్పారు. గతంలో సుధీర్ఘంగా టీడీపీలో ఉన్న బాబూమోహన్… ఆడియోల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని తేల్చేశారు. డోన్ట్ బాదర్, ఐ యామ్ విత్‌ యూ వంటి ఊతపదాలు చంద్రబాబే వాడుతుంటారని కూడా వివరించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబూమోహన్… హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు ఓటుకు నోటు కేసు కూడా తేలుతుందన్నారు. ”అక్కడ ఇటు నుంచి( తెలంగాణ) నుంచి లేరని… అటు […]

Advertisement
Update:2016-09-02 07:59 IST

ఓటుకు నోటు కేసులోని ఆడియో టేపుల్లో ఉంది చంద్రబాబు వాయిసేనని నటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్ చెప్పారు. గతంలో సుధీర్ఘంగా టీడీపీలో ఉన్న బాబూమోహన్… ఆడియోల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని తేల్చేశారు. డోన్ట్ బాదర్, ఐ యామ్ విత్‌ యూ వంటి ఊతపదాలు చంద్రబాబే వాడుతుంటారని కూడా వివరించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబూమోహన్… హైకోర్టు విభజన జరిగితే చంద్రబాబు ఓటుకు నోటు కేసు కూడా తేలుతుందన్నారు. ”అక్కడ ఇటు నుంచి( తెలంగాణ) నుంచి లేరని… అటు నుంచి మాత్రం ఎక్కువ పట్టు ఉంది” అని అన్నారు. ఆడియో టేపుల్లో అంత క్లియర్‌గా ఉన్నా కూడా ఇక చెప్పేదేముంటుందన్నారు. తాను పార్టీలు మారేందుకు వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని వీడకూడదనే అనుకున్నానన్నారు. కానీ కొందరు యధవల మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌ ఫోన్‌ చేసి బామ్మర్ధి టీఆర్‌ఎస్‌లోకి వచ్చేయ్ అన్నారని కాబట్టే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. కేసీఆర్‌ తనను బాగా చూసుకుంటున్నారని చెప్పారు.

ఈ మధ్య ఏబీఎన్‌ ఛానల్ తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని బాబుమోహన్ ఆరోపించారు. బాబుమోహన్‌కు మంత్రి పదవి రాలేదు కాబట్టి బయటకు వెళ్లిపోతారంటూ కథనం ప్రసారం చేసిందన్నారు. ”బాబుమోహన్ అట్లంట, బాబుమోహన్ ఇలాంటి వాడట, అనుకుంటున్నారు, బాబుమోహన్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతాడట, అందరూ ఆయన దెబ్బకు భయపడిపోతున్నారట.. ” అంటూ ఏబీఎన్‌ పదేపదే కథనాలు రాసిందన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసేందుకేనా ఛానల్ పెట్టుకున్నది అని ప్రశ్నించారు. ధైర్యముంటే నేరుగా తన ముందుకే వచ్చి కెమెరా పెట్టి అడగవచ్చు కదా అని నిలదీశారు. ఎవడో యధవ ఏదో చెబితే రాసేస్తారా అని ప్రశ్నించారు. తానేమీ లోఫర్‌ను కాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు అమ్ముకున్నవాడిని తానన్నారు. లంచాలు తీసుకునే వారు తనకు పురుగుల్లా కనిపిస్తారన్నారు బాబుమోహన్.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News