చాయ్‌, సమోసాకు రూ.9 కోట్లా?

చాయ్, సమోసా ఖ‌ర్చు రూ.కోట్లా? అన్ని చాయ్‌లు ఎవ‌రు తాగారు?  సమోసాలు ఎవ‌రు తిన్నారు? ఇంత‌కీ ఏంటీ విష‌యం అనుకుంటున్నారా?  ఈబిల్లు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌జాప్ర‌తినిధులది. ఇది వారి కార్యాల‌యాల‌కు వ‌చ్చిన వ్య‌క్తుల‌కు అయిన ఖ‌ర్చు. ఈ వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ నిన్న అసెంబ్లీ ముందు ఉంచారు. 2012 మార్చి 15 నుంచి 2016 మార్చి 15 వ‌ర‌కు అఖిలేశ్ మంత్రి వ‌ర్గంలోని అమాత్యులు చేసిన ఖ‌ర్చు ఇది! సీఎం చెప్పిన లెక్క‌లు విన్న అధికార […]

Advertisement
Update:2016-09-01 04:05 IST
చాయ్, సమోసా ఖ‌ర్చు రూ.కోట్లా? అన్ని చాయ్‌లు ఎవ‌రు తాగారు? సమోసాలు ఎవ‌రు తిన్నారు? ఇంత‌కీ ఏంటీ విష‌యం అనుకుంటున్నారా? ఈబిల్లు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌జాప్ర‌తినిధులది. ఇది వారి కార్యాల‌యాల‌కు వ‌చ్చిన వ్య‌క్తుల‌కు అయిన ఖ‌ర్చు. ఈ వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ నిన్న అసెంబ్లీ ముందు ఉంచారు. 2012 మార్చి 15 నుంచి 2016 మార్చి 15 వ‌ర‌కు అఖిలేశ్ మంత్రి వ‌ర్గంలోని అమాత్యులు చేసిన ఖ‌ర్చు ఇది! సీఎం చెప్పిన లెక్క‌లు విన్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమీ అనిపించ‌లేక‌పోయినా.. విప‌క్ష స‌భ్యులు మాత్రం విస్తుపోయారు.ఇదేం చోద్యం! చాయ్‌, స‌మోసాల బిల్లు ఇంత అయిందా? భోజ‌నం మానేసి ముప్పూట‌లా చాయ్‌, సమోసా తిని బ‌తికినా ఇంత బిల్లు రాదు క‌దా? అని ముక్కున వేలేసుకున్నారు. ఈ బిల్లుల్లో సింహ‌భాగం అఖిలేశ్ కేబినెట్ మంత్రుల‌దే కావ‌డం విశేషం. మంత్రులంద‌రు టిఫిన్ల కోసం 21 ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించారు. వీరంద‌రి కంటే ఎక్కువ బిల్లు సీఎందే అయిఉంటుంద‌నుకున్నారంతా. కానీ, స‌హాయ మంత్రి అరుణ్ కోరి అత్య‌ధికంగా దాదాపు రూ.23 ల‌క్ష‌లు ఖ‌ర్చుచేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News