ఆత్మాహుతికి సిద్ధమన్న శివాజీ... మీడియా అధినేతపై ఆగ్రహం

ప్రత్యేకహోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించడంపై నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ9 ఛానల్‌తో మాట్లాడిన ఆయన… బ్యాంకు స్కాంలో ఉన్న వ్యక్తి ఏపీ ప్రజల పాలిట శనిలా దాపురించాడని సుజనపై మండిపడ్డారు. స్వార్థం కోసం కేంద్రంతో రాజీపడి ఏపీలో రాబోయే తరాల జీవితాలను నాశనం చేయవద్దని కోరారు. బీహార్‌కు ఎన్నికల సమయంలో మోదీ లక్షా 25వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు […]

Advertisement
Update:2016-09-01 16:29 IST

ప్రత్యేకహోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించడంపై నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ9 ఛానల్‌తో మాట్లాడిన ఆయన… బ్యాంకు స్కాంలో ఉన్న వ్యక్తి ఏపీ ప్రజల పాలిట శనిలా దాపురించాడని సుజనపై మండిపడ్డారు. స్వార్థం కోసం కేంద్రంతో రాజీపడి ఏపీలో రాబోయే తరాల జీవితాలను నాశనం చేయవద్దని కోరారు. బీహార్‌కు ఎన్నికల సమయంలో మోదీ లక్షా 25వేల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్యాకేజ్‌కు అంగీకరిస్తే ఏపీకి కూడా బీహార్‌లాగే చిప్ప మిగులుతుందన్నారు. వెంకయ్యకు సుజనా తొత్తులా మారాడని విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు ప్యాకేజ్‌కు అంగీకరిస్తే ఆయన ఇంటి ముందే ఆత్మాహుతి చేసుకుంటానని శివాజీ చెప్పారు. తాను రాజకీయ నాయకుల్లా మాట తప్పే వ్యక్తిని కాదని, అన్నంత పనిచేసి తీరుతానన్నారు. తన ఆత్మహత్యను ఎవరూ అడ్డుకోలేరని శపథం చేశారాయన.

టీడీపీ అనుకూల పత్రికాధిపతిపైనా శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కంటే ప్యాకేజ్‌ బాగుంటుందంటూ ఒక పత్రికలో కథనాలు రాస్తున్నారని అలా చేయడం మానుకోవాలన్నారు. సదరు పత్రికాధిపతి ప్రత్యేక ప్యాకేజ్‌ వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. పనికట్టుకుని ఇలాంటి కథనాలు రాస్తున్న సదరు పత్రికాధినేత కాస్త కంట్రోల్‌లో ఉంటే రాష్ట్రానికి మంచిదని శివాజీ సూచించారు. కల్లబొల్లి మాటలు మానుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలకు శివాజీ హెచ్చరించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News