కారెం శివాజీ పదవి ఊడినట్టేనా?

ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే కారెం శివాజీని కమిషన్‌ చైర్మన్‌గా నిర్ణయించడంపై కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఎటువంటి అర్హతలు లేని కారెం శివాజీని కమిషన్ చైర్మన్‌గా నియమించారని వ్యాఖ్యానించింది. ఇందుకు కారణాలు ప్రభుత్వానికే తెలియాలంది. విశిష్ట వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలని చట్టం చెబుతుంటే ప్రభుత్వం మాత్రం హడావుడిగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని అభిప్రాయపడింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా […]

Advertisement
Update:2016-09-01 03:56 IST

ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే కారెం శివాజీని కమిషన్‌ చైర్మన్‌గా నిర్ణయించడంపై కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఎటువంటి అర్హతలు లేని కారెం శివాజీని కమిషన్ చైర్మన్‌గా నియమించారని వ్యాఖ్యానించింది. ఇందుకు కారణాలు ప్రభుత్వానికే తెలియాలంది. విశిష్ట వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలని చట్టం చెబుతుంటే ప్రభుత్వం మాత్రం హడావుడిగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని అభిప్రాయపడింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించలేదని వ్యాఖ్యానించింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషన్‌పై వాదనలు ముగియగా నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News