లిక్కర్ బ్యాన్ చేస్తారా....యమునానదిలో దూకి చావమంటారా.....స్వాతంత్ర్య సమరయోధుని హెచ్చరిక!
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని లేకపోతే గాంధీ జయంతి నాడు అక్టోబరు 2న యమునా నదిలో దూకి జలసమాధి అవుతానని 98ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఛిమ్మన్‌లాల్ జైన్ ప్రకటించారు. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిస్థాయిలో నిషేధించడంలో ప్రభుత్వం విఫలమైందని…నిషేధం అమల్లోకి రాకపోతే తాను… మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు గరీబ్‌సేనకు చెందిన బాల్‌యోగి, మహేంద్రకుమార్ పరాషార్ కలిసి యమునలో దూకి ప్రాణాలు తీసుకుంటామని జైన్ హెచ్చరించారు. గత 18నెలలుగా జైన్ మద్యపాన నిషేధం కోసం పోరాటం […]
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని లేకపోతే గాంధీ జయంతి నాడు అక్టోబరు 2న యమునా నదిలో దూకి జలసమాధి అవుతానని 98ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఛిమ్మన్‌లాల్ జైన్ ప్రకటించారు. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిస్థాయిలో నిషేధించడంలో ప్రభుత్వం విఫలమైందని…నిషేధం అమల్లోకి రాకపోతే తాను… మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలు గరీబ్‌సేనకు చెందిన బాల్‌యోగి, మహేంద్రకుమార్ పరాషార్ కలిసి యమునలో దూకి ప్రాణాలు తీసుకుంటామని జైన్ హెచ్చరించారు.
గత 18నెలలుగా జైన్ మద్యపాన నిషేధం కోసం పోరాటం చేస్తున్నారు. దళిత వాడల్లో సమావేశాలు జరుపుతూ నిరస ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జైన్ మూడు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు సకాలంలో ఆయనను కాపాడారు. ఈ సారి కూడా ఆయనను గాంధీ జయంతి రోజున ఇంట్లోంచి బయటకు రాకుండా చేస్తారని భావిస్తున్నారు. పేదల బతుకులను మద్యం గుల్ల చేస్తున్నదని, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని…ఈ ఫలితాన్ని వారి పిల్లలు అనుభవిస్తున్నారని జైన్ అన్నారు. మద్యం అమ్మకాలు ఇరవై నాలుగు గంటలూ జరుగుతున్నా…పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.