అమృత మైత్రేయి లేఖతో మురిసిన చంద్రబాబు

పుష్కరాల ద్వారా చంద్రబాబు బాగానే ప్రచారం తెచ్చుకున్నారు. పుష్కరాలు విజయవంతంగా పూర్తి చేశామంటూ చంద్రబాబును అభినందిస్తూ ”థ్యాంక్యూ సీఎం” అంటూ చంద్రబాబు ఫొటోతోనే విజయవాడ రోడ్ల వెంబడి భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి.  తాజాగా పుష్కరాలకు సంబంధించి వచ్చిన ఒక లేఖ చంద్రబాబుకు తెగ సంతోషాన్నిచ్చింది. అమృత మైత్రేయి అనే అమ్మాయి పేరుతో వచ్చిన ఈ లేఖను చూసి మురిసిపోయిన చంద్రబాబు ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. తాను పుష్కరాల కోసం విజయవాడ వచ్చామని.. మీరు ఏర్పాటు చేసిన ఘాట్లు, సౌకర్యాలు […]

Advertisement
Update:2016-08-30 06:52 IST

పుష్కరాల ద్వారా చంద్రబాబు బాగానే ప్రచారం తెచ్చుకున్నారు. పుష్కరాలు విజయవంతంగా పూర్తి చేశామంటూ చంద్రబాబును అభినందిస్తూ ”థ్యాంక్యూ సీఎం” అంటూ చంద్రబాబు ఫొటోతోనే విజయవాడ రోడ్ల వెంబడి భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా పుష్కరాలకు సంబంధించి వచ్చిన ఒక లేఖ చంద్రబాబుకు తెగ సంతోషాన్నిచ్చింది. అమృత మైత్రేయి అనే అమ్మాయి పేరుతో వచ్చిన ఈ లేఖను చూసి మురిసిపోయిన చంద్రబాబు ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. తాను పుష్కరాల కోసం విజయవాడ వచ్చామని.. మీరు ఏర్పాటు చేసిన ఘాట్లు, సౌకర్యాలు చాలా బాగున్నాయని నాలుగో తరగతి చదవుతున్న అమృత చంద్రబాబుకు కితాబిచ్చింది. రాజధాని మమ్మల్ని ఎంతగానో అలరించిందంటూ పెద్దపదాలే లేఖలో రాసింది నాలుగో తరగతి అమృత. చిన్న పిల్లలు తప్పిపోకుండా ట్యాగ్‌లతో బాగా పనిచేశారంది. సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఎంతగానో అలరించాయంది. మునుముందు కూడా ఇలాగే విజయవంతంగా పనిచేయాలని చంద్రబాబుకు అమృత సూచించింది. అయితే నాలుగో తరగతి చదువుతున్న అమృత తన లేఖలో వాడిన తెలుగు పదాలు మాత్రం గొప్పగా ఉన్నాయి. చిన్నారి లేఖ రాసిన తీరు చూస్తుంటే చిన్నవయసులోనే బాషపై గట్టి పట్టుసాధించినట్టుగా, పండితులు రాసిన స్థాయిలో రాయడం ఆశ్చర్యం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News