రెండోసారీ.. మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్‌గా తెలంగాణే!
తెలంగాణ సిగలో మరో జాతీయ అవార్డు వచ్చిచేరింది. సీఎన్‌బీసీ టీవీ -18 నిర్వహించిన సర్వేలో ఈ ఏడాదికి గానూ తెలంగాణ రాష్ర్టాన్ని మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్‌గా ఎంపిక చేశారు. సీఎన్‌బీసీ టీవీ-18 ఛానల్ ఏటా నిర్వహించే ‘ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్’లో భాగంగా తెలంగాణ ఈ పురస్కారానికి ఎంపికైంది. అభివృద్ధి, దేశసమగ్రత, వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు తదితర అంశాల ఆధారంగా ఈ అవార్డును అందజేస్తారు. ఈ నెల30న దేశరాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి […]
Advertisement
తెలంగాణ సిగలో మరో జాతీయ అవార్డు వచ్చిచేరింది. సీఎన్‌బీసీ టీవీ -18 నిర్వహించిన సర్వేలో ఈ ఏడాదికి గానూ తెలంగాణ రాష్ర్టాన్ని మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్‌గా ఎంపిక చేశారు. సీఎన్‌బీసీ టీవీ-18 ఛానల్ ఏటా నిర్వహించే ‘ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్’లో భాగంగా తెలంగాణ ఈ పురస్కారానికి ఎంపికైంది. అభివృద్ధి, దేశసమగ్రత, వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు తదితర అంశాల ఆధారంగా ఈ అవార్డును అందజేస్తారు. ఈ నెల30న దేశరాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు స్వీకరించాల్సిందిగా సీఎన్ బీసీ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే ఆహ్వానం పంపింది. ఈ విశిష్ట పురస్కారాన్ని స్వీకరించేందుకు తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
తెలంగాణ రాష్ట్రం సీఎన్‌బీసీ టీవీ -18 అవార్డును అందుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అందులోనూ ఇదే విభాగంలో (మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్) అందుకోవడం రెండోసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పనుల్లో పారదర్శకత తదితరాల్లో ఫలితాలను గమనించి ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నారు.
Advertisement