స్కూలు బ్యాగుల బరువుపై ఆ బుడతడు.... ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టాడు!
స్కూలు బ్యాగులు మోయలేకపోతున్నామని టీచర్లకు చెప్పి చెప్పి, ప్రిన్స్పాల్కి లేఖలు కూడా రాసి విసిగిపోయిన 12ఏళ్ల విద్యార్థి రుగ్వేద్ ప్రెస్క్లబ్కి వెళ్లి జర్నలిస్టులకు తన గోడు చెప్పుకున్నాడు. మహారాష్ట్ర, చంద్రాపూర్ జిల్లాలో ఉన్న విద్యానికేతన్ స్కూల్లో ఏడవతరగతి చదువుతున్నాడు రుగ్వేద్. అతనికి పుస్తకాల బ్యాగు మోయటం భారంగా మారిపోయింది. క్లాసులో టీచర్లకి చెప్పినా, ప్రిన్స్పాల్ కి లేఖ రాసినా ఫలితం లేకపోవటంతో తన క్లాస్‌మేట్ పరితోష్ ధండేకర్‌తో కలిసి సోమవారం సరాసరి చంద్రాపూర్‌లో ఉన్న ప్రెస్ క్లబ్ […]
స్కూలు బ్యాగులు మోయలేకపోతున్నామని టీచర్లకు చెప్పి చెప్పి, ప్రిన్స్పాల్కి లేఖలు కూడా రాసి విసిగిపోయిన 12ఏళ్ల విద్యార్థి రుగ్వేద్ ప్రెస్క్లబ్కి వెళ్లి జర్నలిస్టులకు తన గోడు చెప్పుకున్నాడు. మహారాష్ట్ర, చంద్రాపూర్ జిల్లాలో ఉన్న విద్యానికేతన్ స్కూల్లో ఏడవతరగతి చదువుతున్నాడు రుగ్వేద్. అతనికి పుస్తకాల బ్యాగు మోయటం భారంగా మారిపోయింది. క్లాసులో టీచర్లకి చెప్పినా, ప్రిన్స్పాల్ కి లేఖ రాసినా ఫలితం లేకపోవటంతో తన క్లాస్‌మేట్ పరితోష్ ధండేకర్‌తో కలిసి సోమవారం సరాసరి చంద్రాపూర్‌లో ఉన్న ప్రెస్ క్లబ్ కి వెళ్లాడు.
పిల్లలు అలా ప్రెస్క్లబ్కి రావటంతో జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. రుగ్వేద్, పరితోష్ తాము ఎందుకు వచ్చామో జర్నలిస్టులకు చెప్పారు. పుస్తకాల భారాన్ని తమపై బలవంతంగా మోపుతున్నారని…రోజూ కనీసం 16 పుస్తకాలు మోయాల్సి వస్తోందని, ఎనిమిది టెక్ట్స్ పుస్తకాలు, ఎనిమిది నోట్సులు ఉంటున్నాయని, ఒక్కోసారి స్పెషల్ క్లాసులు ఉంటే 20 పుస్తకాలు మోయాల్సి వస్తోందని చెప్పారు. స్కూలు వరకే కాదు…రెండవ మూడవ అంతస్తుల్లో ఉన్న క్లాసులకు పుస్తకాలు మోయటం తమ వల్ల కావటం లేదని వివరించారు.
రుగ్వేద్, పరితోష్ చెప్పింది మీడియాలో వచ్చాక… బుధవారం వాళ్ల స్కూల్లో పుస్తకాలు అక్కడే ఉంచేలా లాకర్లు ఏర్పాటు చేసింది స్కూలు యాజమాన్యం. ఇంతకుముందు ఆ సౌకర్యం అనారోగ్యంగా ఉన్న పిల్లలకు మాత్రమే ఉండేదని రుగ్వేద్ తెలిపాడు.
ప్రెస్ క్లబ్లో విషయం చెప్పిరాగానే పరితోష్ భయపడిపోయాడు. ఇక తాను ఇలాంటివి కల్పించుకోనని చెప్పాడు. కానీ రుగ్వేద్ మాత్రం ఈ విషయాన్ని వదిలేలా లేడు. ఒక్క తన స్కూల్లోనే కాదు, దేశంలోని అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలు సైతం ఈ నిర్ణయం తీసుకునేలా పోరాడతానని చెబుతున్నాడు. అంతకుముందు కూడా తమ రాష్ట్ర విద్యామంత్రి వినోద్ తవాడేతో మాట్లాడాలని ప్రయత్నించానని కానీ ఆయన సిబ్బంది… మంత్రిగారు బిజీగా ఉన్నారని చెప్పారని రుగ్వేద్ చెప్పాడు.
పరితోష్ భయపడటం గురించి మాట్లాడుతూ…అతని తల్లిదండ్రుకు స్కూలు యాజమాన్యంతో గొడవవుతుందని భయపడుతున్నారని…కానీ తన పోరాటం తన స్కూలు యాజమాన్యంతో కాదని…మొత్తం విద్యా విధానంతో అని రుగ్వేద్ తెలిపాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని తనలా బాధపడుతున్న విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెబుతున్నాడు. పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. కనీసం పుస్తకాలు పెట్టుకునే లాకర్ల సౌకర్యం కూడా కల్పించలేరా…అని అడుగుతున్నాడు ఈ బుల్లి విద్యా కార్యకర్త.
Click on Image to Read: