దేశ ప్రజలందరికీ పింఛన్‌ వర్తించేలా కొత్త పథకం

కొత్త పథకంపై కసరత్తు చేస్తున్న ఈపీఎఫ్‌వో

Advertisement
Update:2025-02-27 11:06 IST

ప్రజలందరికీ పింఛన్‌ వర్తించేలా కొత్త పథకాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగం కార్మికులకు వర్తించేలా నూతన పథకాన్ని తీసుకురానున్నదని కార్మిక, ఉపాధి కల్పన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లలో పనిచేసే వారు, గిగ్‌ వర్కర్ల వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోకి కొన్ని పథకాలు అందడటం లేదు. దీంతో వారికి వర్తించే సార్వత్రిక పథకాన్నితీసుకురానున్నదని తెలిసింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం అమలు చేస్తున్న పథకాలను క్రమబద్ధీకరించి పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలను జమ చేసుకుని 60 ఏండ్ల తర్వాత పింఛన్‌ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తున్నది. కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) కసరత్తు చేస్తున్నది. విధి విధానాలపై త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని కార్మిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. జాతీయ పింఛన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) ఇకపై యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News