భారతీయ ఐక్యతకు 'మహాకుంభమేళా' నిదర్శనం
మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు మోడీ ధన్యవాదాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక 'మహాకుంభమేళా' ఈ నెల 26న ముగిసింది. ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందన్నారు. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారని పేర్కొన్నారు. మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ఈ సందర్భంగా మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడమనేది అంత ఈజీ కాదని తెలుసు. మా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని ఆ గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నానని మోడీ రాసుకొచ్చారు.