స్మృతీ ఇరానీని అందుకే వ‌ద్దన్నార‌ట‌!

స్మృతీ ఇరానీ.. టీవీ న‌టిగా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆమె తెలియ‌ని వారు ఉండేవారు కాదంటే అతిశ‌యోక్తి కాదు. ఆమెకు మ‌హిళ‌ల్లో ఉన్న ఫాలోయింగ్‌ను గుర్తించిన‌ బీజేపీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. రెండేళ్ల క్రితం ఆమె లైఫ్ ఎవ‌రూ ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. ఏకంగా కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌రించ‌డంతో దేశం మొత్తం ఆశ్చ‌ర్యంలో మునిగిపోయింది. అదీ.. ఎంతో కీల‌క‌మైన హెచ్ ఆర్‌డీ విభాగాన్ని అప్ప‌జెప్పారు. త‌రువాత ప‌లు వివాదాల నేప‌థ్యంలో ఆమెను […]

Advertisement
Update:2016-08-26 02:55 IST
స్మృతీ ఇరానీ.. టీవీ న‌టిగా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆమె తెలియ‌ని వారు ఉండేవారు కాదంటే అతిశ‌యోక్తి కాదు. ఆమెకు మ‌హిళ‌ల్లో ఉన్న ఫాలోయింగ్‌ను గుర్తించిన‌ బీజేపీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. రెండేళ్ల క్రితం ఆమె లైఫ్ ఎవ‌రూ ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. ఏకంగా కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌రించ‌డంతో దేశం మొత్తం ఆశ్చ‌ర్యంలో మునిగిపోయింది. అదీ.. ఎంతో కీల‌క‌మైన హెచ్ ఆర్‌డీ విభాగాన్ని అప్ప‌జెప్పారు. త‌రువాత ప‌లు వివాదాల నేప‌థ్యంలో ఆమెను ఆ విభాగం నుంచి జౌళి శాఖ‌కి మార్చార‌నుకోండి. మొత్తానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని సంచ‌ల‌నాల‌కు చిరునామాగా చెప్ప‌వ‌చ్చు. తాజాగా ఆమె మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచారు.
ఢిల్లీలో ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఎలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చింది వివ‌రించారు. ప‌నిలో ప‌నిగా… తాను యువ‌తిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌టన గురించి కూడా వెల్ల‌డించారు. ఆమె మోడ‌లింగ్‌లోకి రాక‌ముందు జెట్ ఎయిర్‌వేస్ క్యాబిన్ క్రూ గా చేరాల‌ని ఆశ‌ప‌డ్డార‌ట‌. ద‌ర‌ఖాస్తు కూడా చేసుకున్నార‌ట‌. కానీ, నీ ప‌ర్స‌నాలిటీ ఇందుకు సూట‌వ్వ‌దు అంటూ వారు ఆమెను తిర‌స్క‌రించార‌ట‌. ఇప్పుడు ఈ విషయం త‌ల‌చుకుంటే న‌వ్వొస్తుంద‌ని అన్నారు. నిజంగా వారు న‌న్ను సెలెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు నేను కేంద్ర మంత్రిని అయ్యేదాన్ని కాదేమో! అని చ‌మ‌త్కరించారు.
Tags:    
Advertisement

Similar News