"100 డేస్ లవ్" ఆడియన్స్ కు ఎక్కడం అనేది ఒకింత కష్టమైన పనే
100 డేస్ .! లవ్ సినియా అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాల్సి రావడమే ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్. హీరోయిన్‌ను వెతకడంలోనే ఒక భాగం మొత్తం పూర్తవ్వడంతో, ప్రేమకథను సెకండాఫ్‌లో కానీ మొదలుపెట్టలేదు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలు కూడా కొన్ని మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు, కొంత బోర్ కొట్టించినట్లు అనిపించాయి. ముఖ్యంగా నిత్యా మీనన్ కూడా ఇంటర్వెల్ వరకూ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వకపోవడం మైనస్సే. సెకండాఫ్‌లో నిత్యా మీనన్ – […]
100 డేస్ .! లవ్ సినియా అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాల్సి రావడమే ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్. హీరోయిన్‌ను వెతకడంలోనే ఒక భాగం మొత్తం పూర్తవ్వడంతో, ప్రేమకథను సెకండాఫ్‌లో కానీ మొదలుపెట్టలేదు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలు కూడా కొన్ని మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు, కొంత బోర్ కొట్టించినట్లు అనిపించాయి. ముఖ్యంగా నిత్యా మీనన్ కూడా ఇంటర్వెల్ వరకూ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వకపోవడం మైనస్సే. సెకండాఫ్‌లో నిత్యా మీనన్ – దుల్కర్‌ల రొమాన్స్‌తో సినిమా మళ్ళీ అసలు కథలోకి వచ్చినా అప్పటికే చాలా సమయం కాలయాపన చేశారనిపించింది.
స్లో నెరేషన్‌ను ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ప్రేమకథలన్నీ స్లో నెరేషన్‌తోనే చెప్పడానికి దర్శకులెవరైనా ఇష్టపడతారన్నది ఒప్పుకునేదే అయినా, ఈ సినిమా మరీ నెమ్మదిగా నడిచినట్లనిపించింది. 155 నిమిషాల మేర నిడివి ఉన్న ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అనవసరమైనవిగానే కనిపించాయి. ఆడియన్స్ కు ఈ చిత్రం ఎక్కడం అనేది ఒకింత కష్టమైన పనే.