ఇజమ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు...

పూరీ జగన్నాధ్ మరోసారి తన స్పీడ్ ఏంటో చూపిస్తున్నాడు. తక్కువ షెడ్యూల్స్ లో ఎక్కువ సీన్లు లాగించేస్తున్నాడు. మొన్నటికి మొన్న ప్రారంభించిన ఇజమ్ సినిమాను దాదాపు కంప్లీట్ చేశాడు పూరి జగన్. ఈమధ్య ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని శంషాబాద్, గోల్కొండ సమీప ప్రాంతాల్లో చిత్రీకరించారు. త్వరలోనే యూనిట్ మొత్తం స్పెయిన్ వెళ్లబోతోంది. ఆ షెడ్యూల్ తో ఇజమ్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోతుంది. కల్యాణ్ రామ్ తనే నిర్మాతగా, హీరోగా ఇజమ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. […]

Advertisement
Update:2016-08-24 03:19 IST

పూరీ జగన్నాధ్ మరోసారి తన స్పీడ్ ఏంటో చూపిస్తున్నాడు. తక్కువ షెడ్యూల్స్ లో ఎక్కువ సీన్లు లాగించేస్తున్నాడు. మొన్నటికి మొన్న ప్రారంభించిన ఇజమ్ సినిమాను దాదాపు కంప్లీట్ చేశాడు పూరి జగన్. ఈమధ్య ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని శంషాబాద్, గోల్కొండ సమీప ప్రాంతాల్లో చిత్రీకరించారు. త్వరలోనే యూనిట్ మొత్తం స్పెయిన్ వెళ్లబోతోంది. ఆ షెడ్యూల్ తో ఇజమ్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోతుంది. కల్యాణ్ రామ్ తనే నిర్మాతగా, హీరోగా ఇజమ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తోంది. మీడియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ ఇప్పటికే సిక్స్ ప్యాక్ లోకి మారిపోయాడు. లుక్స్ కూడా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, కల్యాణ్ రామ్ లుక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఇజమ్ సినిమా ఆడియోను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్-కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.

Also Read

జనతా గ్యారేజ్ విడుదల తేదీ మళ్లీ మారింది…
మరోసారి హిట్ పై కన్నేసిన సూర్య
పుట్టినరోజు నాడు చిరంజీవి చేసిన పని ఇదే…
ర‌క్త చ‌రిత్ర 2 పార్ట్స్… న‌యిమ్ చ‌రిత్ర 3 భాగాలు అంటున్న వ‌ర్మ‌
Tags:    
Advertisement

Similar News