గణేశ్ ఉత్సవాలకు చందా ఇవ్వకపోతే గుంజిళ్లు
గణేశ్ ఉత్సవాలు నిర్వహించే వారికి చందా ఇవ్వడానికి నిరాకరించినందుకు పుణేలోని ఒక బేకరీ ఉద్యోగులను గుంజిళ్లు తీయించారు. ఆగస్టు 15వ తేదీన పుణేలోని భోసారి ప్రాంతంలో జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉదంతంలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు. గణేశ్ మంటపం నిర్వహిస్తున్న వారు ఒక బేకరీకి వెళ్లి అక్కడ పని చేస్తున్న వారిని రూ. 151 చందా ఇవ్వమని కోరారు. బేకరీలో పని చేస్తున్న వారు […]
గణేశ్ ఉత్సవాలు నిర్వహించే వారికి చందా ఇవ్వడానికి నిరాకరించినందుకు పుణేలోని ఒక బేకరీ ఉద్యోగులను గుంజిళ్లు తీయించారు. ఆగస్టు 15వ తేదీన పుణేలోని భోసారి ప్రాంతంలో జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉదంతంలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు.
గణేశ్ మంటపం నిర్వహిస్తున్న వారు ఒక బేకరీకి వెళ్లి అక్కడ పని చేస్తున్న వారిని రూ. 151 చందా ఇవ్వమని కోరారు. బేకరీలో పని చేస్తున్న వారు మహారాష్ట్రీయులు కారు. బేకరీ యజమాని లేనందువల్ల చందా ఇవ్వలేమని చెప్పారు. చందా అడగడానికి వచ్చిన ప్రకాశ్ లండగే, గణేశ్ లండగే, మహేశ్ మరే చందా ఇవ్వని వారిని దూషించడమే కాకుండా వారి చేత గుంజిళ్లు తీయించారు.
ఈ కార్మికులలో ఇర్షాద్ మహమ్మద్ అయూబ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Click on Image to Read: