వరుడి మృతి.. ఆగిన పెళ్లి.. వధువు ఆత్మహత్య!
వారంలో పెళ్లి.. వధువు, వరుడు.. ఒకరికొకరు నచ్చారు. ఈనెల 27న పెళ్లికి ముహూర్తం.. ఇంకేముంది.. వధూవరుల మధ్య ఫోన్‌లో మాటలు కలిశాయి. కొత్త జీవితం గురించి కోటి కలలు కన్నారు. కానీ, విధి వారిపై చిన్నచూపు చూసింది. పెళ్లికి వారంరోజుల ముందు వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలిసి మనోవేదనకు గురైన వధువు కూడా తనువు చాలించింది. కన్నీళ్లు తెప్పించే ఈ విషాదఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గూండ్రు […]
Advertisement
వారంలో పెళ్లి.. వధువు, వరుడు.. ఒకరికొకరు నచ్చారు. ఈనెల 27న పెళ్లికి ముహూర్తం.. ఇంకేముంది.. వధూవరుల మధ్య ఫోన్‌లో మాటలు కలిశాయి. కొత్త జీవితం గురించి కోటి కలలు కన్నారు. కానీ, విధి వారిపై చిన్నచూపు చూసింది. పెళ్లికి వారంరోజుల ముందు వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలిసి మనోవేదనకు గురైన వధువు కూడా తనువు చాలించింది. కన్నీళ్లు తెప్పించే ఈ విషాదఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గూండ్రు లక్ష్మీ, ఉప్పలయ్యల కుమార్తె ప్రమీలకు మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌కు చెందిన తాడెం ప్రభాకర్‌తో వివాహం ఖాయమైంది. ఈ నెల 27న పెళ్లి చేయడానికి ముహూర్తం నిశ్చయించారు. వధూవరులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంతా మెచ్చుకున్నారు. ఇటు వధువు, అటు వరుడి తల్లిదండ్రులు ఎవరికి వారు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఈలోగా వారి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. ఈనెల 18న రాఖీ వేడుకలకు బంధువుల ఇంటికి వెళ్లి వస్తోన్న ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ వార్త తెలిసిన రెండు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. వధువు ప్రమీల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభాకర్ మరణాన్ని తట్టుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రభాకర్ లేని జీవితాన్ని ఊహించుకోలేక సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రమీల మరణంతో మరోసారి ఆ రెండుకుటుంబాలను విషాదం అలుముకుంది.
Advertisement