45 రోజుల కర్ఫ్యూతో... అల్లాడుతున్న కాశ్మీర్
45 రోజులుగా కర్ఫ్యూతో అష్ట కష్టాలు పడుతున్న కాశ్మీర్ ప్రజలకు ఊరట కల్పించేందుకు వెంటనే కేంద్రం చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా నాయకత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైంది. కాశ్మీర్ ప్రజల ఆక్షాంక్షలను అర్థం చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఉమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు కాశ్మీర్‌లో […]
Advertisement
45 రోజులుగా కర్ఫ్యూతో అష్ట కష్టాలు పడుతున్న కాశ్మీర్ ప్రజలకు ఊరట కల్పించేందుకు వెంటనే కేంద్రం చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా నాయకత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైంది. కాశ్మీర్ ప్రజల ఆక్షాంక్షలను అర్థం చేసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఉమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు కాశ్మీర్‌లో చేపట్టిన అణిచివేత చర్యలను ఆయన దుయ్యబట్టారు. పరిపాలన పరంగా భద్రతా దళాలతో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాశ్మీర్ ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను తెలుసుకుని వెంటనే ఆందోళన కారులతో చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధాని మోడీకి అందజేశారు. 45 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూ కారణంగా కాశ్మీర్‌లో ప్రజల సాధారణ జీవితానికి పూర్తిగా భంగం వాటిల్లిందని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కాశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో భద్రతా దళాలు విఫల మయ్యాయని ఆరోపించారు. కాశ్మీర్‌లో మామూలు పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నేతలు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయడం లేదని విమర్శించిన విషయం విదితమే. ప్రధాని మోడీతో భేటీ అయిన వారిలో కాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.ఎ. మీర్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగమీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు నజీర్ వనీ, దేవేందర్ రాణా, తదితరులున్నారు.
Advertisement