షర్మిల విషయంలో కేశవ్‌కు సమాధానం దొరికిందా?

జగన్ మీద నమ్మకం లేకనే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… జగన్ తన సొంత కుటుంబసభ్యుల్లో కూడా నమ్మకం కలిగించలేకపోతున్నారని అన్నారు. అంత దూరం నడిచిన షర్మిల ఇప్పుడు ఎక్కడుందంటే జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రచారంలో పాల్గొన్న విజయమ్మ ఇప్పుడేమయ్యారని కేశవ్ ప్రశ్నించారు. సొంతకుటుంబ సభ్యులకు నమ్మకం లేక దూరమవుతున్నారన్నారు. అయితే షర్మిల ఎక్కడున్నారని కేశవ్ ప్రశ్నించినప్పటికీ… రాఖీ […]

Advertisement
Update:2016-08-19 14:25 IST

జగన్ మీద నమ్మకం లేకనే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చెప్పారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… జగన్ తన సొంత కుటుంబసభ్యుల్లో కూడా నమ్మకం కలిగించలేకపోతున్నారని అన్నారు. అంత దూరం నడిచిన షర్మిల ఇప్పుడు ఎక్కడుందంటే జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రచారంలో పాల్గొన్న విజయమ్మ ఇప్పుడేమయ్యారని కేశవ్ ప్రశ్నించారు. సొంతకుటుంబ సభ్యులకు నమ్మకం లేక దూరమవుతున్నారన్నారు. అయితే షర్మిల ఎక్కడున్నారని కేశవ్ ప్రశ్నించినప్పటికీ… రాఖీ పండుగ నాడు జగన్‌కు షర్మిల రాఖీ కడుతూ ఆనందంగా కనిపించారు. ఆ ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోల ద్వారా జగన్‌కు షర్మిల దూరం అయ్యారా లేదా అన్నది పయ్యావులకు క్లారిటీ రావచ్చు. బహుశా పయ్యావుల కేశవ్ దృష్టిలో షర్మిల రాజకీయంగా చురుగ్గా ఉండడం అంటే నిత్యం మీడియాలో కనిపించి.. రాజకీయంగా చురకైన పాత్ర పోషించడం కాబోలు.

వచ్చే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పయ్యావుల చెప్పారు. ఫలితం ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని… ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే బరిలో దిగుతానన్నారు. మంత్రి పదవి వస్తే జిల్లాకు సేవ చేయడానికి ఈజీగా ఉంటుందన్నారు. మంత్రి పదవికి పోటీ వస్తారన్న ఉద్దేశంతో సొంత సామాజికవర్గానికే చెందిన ఒక గ్రూప్ మొన్నటి ఎన్నికల్లో ఓడించిందన్న ప్రశ్నకు పయ్యావుల స్పందించారు. అలా జరిగి ఉండవచ్చని.. కానీ వాటన్నింటిని ఎదుర్కోవడమే రాజకీయం అన్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తండ్రి, సోదరుడి హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనకు వెపన్స్ అంటే చాలా ఇష్టమని ఇంటర్వ్యూలో పయ్యావుల చెప్పారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో మంచిమంచి రైఫిల్స్ చూస్తూ పెరిగానని అందుకే ఇప్పటికీ తనకు ఆయుధాలంటే చాలా ఇష్టమని కేశవ్ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News