ఆప్‌లో చేరేందుకు సిద్ధూ షరతులు విధించలేదు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఎలాంటి షరతులు విధించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పష్టం చేశారు. ఆప్‌లో చేరే విషయంలో ముందస్తుగా సిద్ధూ కొన్ని షరతులు విధించారని, ఆయనతో పాటు భార్య నవజోత్ కౌర్ సిద్ధూకు టికెట్లు అడిగారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కేజ్రీవాల్ ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సిద్ధూ, ఆయన సతీమణి కౌర్ ఇటీవల తనను కలిశారని చెప్పారు. దేశ […]
ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఎలాంటి షరతులు విధించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం స్పష్టం చేశారు. ఆప్‌లో చేరే విషయంలో ముందస్తుగా సిద్ధూ కొన్ని షరతులు విధించారని, ఆయనతో పాటు భార్య నవజోత్ కౌర్ సిద్ధూకు టికెట్లు అడిగారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కేజ్రీవాల్ ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సిద్ధూ, ఆయన సతీమణి కౌర్ ఇటీవల తనను కలిశారని చెప్పారు. దేశ రాజకీయాల గురించి చర్చించామని చెప్పారు. సిద్ధూ చిత్తశుద్ధి గల నాయకుడని కేజ్రీవాల్ ప్రశంసించారు. కాగా ఆప్‌లో చేరేందుకు తనకు కొంత సమయం అవసరమని తాను భావిస్తున్నానని చెప్పారు. సిద్ధూ ఆప్‌లో చేరినా, చేరక పోయినా ఆయనను తాను అభిమానిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. బీజేపీ ఎంపీగా ఉన్న సిద్ధూ ఆ పార్టీ విధానాలు నచ్చనందు వల్ల రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.
తనను పంజాబ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పని చేయాలని బీజేపీ నాయకులు ఆదేశించినందువల్లనే తాను బీజేపీని వీడినట్టు సిద్ధూ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న సిద్ధూ ఆప్‌లో చేరనున్నట్టు ప్రచారం జరిగింది. అయితే సిద్ధూ రాజకీయ భవిష్యత్తుపై రెండు రోజులుగా అనేక వార్త కథనాలు మీడియాలో వెలువడ్డాయి. ఆయన ఆప్‌లో కాకుండా కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని కేజ్రీవాల్ ప్రకటన ద్వారా స్ఫష్టం అవుతోంది.