రోజాకు జగన్ అంత ధైర్యాన్ని ఇచ్చారా?
ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రవేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా … జగన్‌కు రాఖీ కట్టారు. ఈసందర్బంగా ఆమె పలు విషయాలు చెప్పారు. వైఎస్‌ఆర్ అంత్యక్రియల సమయంలోనే తాను తొలిసారిగా జగన్‌ను కలిశానని చెప్పారు. అప్పటి నుంచి జగన్ తనను సొంత సోదరిలాగా చూసుకుంటున్నారని చెప్పారు. అది తాను చేసుకున్న అదృష్టమన్నారామె. విజయమ్మను అమ్మ అని పిలుస్తానని… ఆమె కూడా తన పట్ల అంతే అప్యాయంగా ఉంటారన్నారు. టీడీపీ కుట్రపన్ని తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి […]
ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రవేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా … జగన్‌కు రాఖీ కట్టారు. ఈసందర్బంగా ఆమె పలు విషయాలు చెప్పారు. వైఎస్‌ఆర్ అంత్యక్రియల సమయంలోనే తాను తొలిసారిగా జగన్‌ను కలిశానని చెప్పారు. అప్పటి నుంచి జగన్ తనను సొంత సోదరిలాగా చూసుకుంటున్నారని చెప్పారు. అది తాను చేసుకున్న అదృష్టమన్నారామె. విజయమ్మను అమ్మ అని పిలుస్తానని… ఆమె కూడా తన పట్ల అంతే అప్యాయంగా ఉంటారన్నారు. టీడీపీ కుట్రపన్ని తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బయటకు పంపించిందని ఆ సమయంలో జగన్ తనకు ఎంతో అండగా నిలబడ్డారన్నారు. అప్పటి నుంచే జగన్‌ను సొంత అన్న కంటే ఎక్కువగా అభిమానిస్తున్నానని రోజా చెప్పారు. జగన్ ఉన్నంత కాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు.
Click on Image to Read: