జడ్జీల నిజాయితీపై బాబు నీడలు పడుతున్నాయా?

హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏపీ సీఎం పదేపదే కలుస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం తలపెట్టినా తప్పనిసరిగా పెద్దపెద్ద న్యాయమూర్తులను మాత్రం స్వయంగా కలిసి ఆహ్వానిస్తుంటారు. చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడమే న్యాయమూర్తులకు ఎలాంటి దురుద్దేశం లేకపోవచ్చు. కానీ ఏపీ చంద్రబాబు పాలనపై వెల్లువెత్తుతున్న వేల కోట్ల అవినీతి ఆరోపణల నేపథ్యంలో న్యాయమూర్తులను బాబు కలవడం లేనిపోని అనుమానాలకు తావిస్తున్నది. ఒక రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ప్రస్తానం చాలా వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఓటుకు నోటు […]

Advertisement
Update:2016-08-17 05:33 IST

హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏపీ సీఎం పదేపదే కలుస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం తలపెట్టినా తప్పనిసరిగా పెద్దపెద్ద న్యాయమూర్తులను మాత్రం స్వయంగా కలిసి ఆహ్వానిస్తుంటారు. చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడమే న్యాయమూర్తులకు ఎలాంటి దురుద్దేశం లేకపోవచ్చు. కానీ ఏపీ చంద్రబాబు పాలనపై వెల్లువెత్తుతున్న వేల కోట్ల అవినీతి ఆరోపణల నేపథ్యంలో న్యాయమూర్తులను బాబు కలవడం లేనిపోని అనుమానాలకు తావిస్తున్నది. ఒక రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ప్రస్తానం చాలా వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఓటుకు నోటు కుంభకోణంలో ఆడియో, వీడియో టేపుల్లో దొరికిన ఏకైక సీఎం చంద్రబాబే. అలాంటి వివాదాస్పద సీఎం ఉన్నత న్యాయమూర్తులను పదేపదే కలవడంపై సోషల్ మీడియాతో పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన వెళ్లేటప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదాలు, శ్రీవారికి కప్పిన పట్టు వస్త్రాలు వంటి కానుకలు తీసుకొని వెళ్లి న్యాయమూర్తులకు ఇవ్వడం, దేవుని కానుకలను వాళ్లు కాదనలేకపోవడం, మొహమాట పడడం చూసే వాళ్లకు ఇబ్బందికరంగానే ఉంది. అంతేకాకుండా న్యాయమూర్తులకు ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించలేనప్పటికీ చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు దాదాపు అన్ని కేసుల్లోనూ తీర్పులు ఆయనకే సానుకూలంగా వస్తుండడం కూడా పాయింటవుట్ అవుతోంది.

చంద్రబాబు అవినీతిపై అనేకమంది కోర్టుకు వెళ్లినా వాటన్నింటిపైనా స్టేలు వచ్చాయి. ఆ మధ్య చంద్రబాబు అవినీతిపై వైఎస్ విజయమ్మ పిటిషన్‌పై ఒక బెంచ్ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే అంతలోనే మరో బెంచ్‌ ఇది రాజకీయ కక్షసాధింపు పిటిషన్ అంటూ పక్కన పెట్టింది. అమరావతి భూదందాపై పత్రికల్లో పుంకానుపుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ విచారణకు కూడా సుప్రీం కోర్టు ఓపిక చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కోర్టుల్లో చంద్రబాబును గెలవడం అంత సులువు కాదన్న భావన మంచికో చెడుకో గానీ ప్రతి ఒక్కరిలో బాగా పాతుకుపోతోంది.. ఈ మొత్తం నేపథ్యంలో న్యాయవ్యవస్థపై మచ్చ పడకూడదని భావిస్తున్న ప్రజాస్వామ్యవాదులు… పదేపదే చంద్రబాబు న్యాయమూర్తులను కలవడాన్ని సమర్థించలేకపోతున్నారు.

చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావడం, తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో ఉండడం కూడా చంద్రబాబుకు బాగా కలిసివచ్చిందంటున్నారు. న్యాయమూర్తులను తమ వాళ్ల ద్వారా తిరుపతికి ఆహ్వానించడం, ఇక్కడ రాచమర్యాదలు చేసి వాళ్లను ప్రసన్నం చేసుకోవడం వల్ల న్యాయమూర్తులపై ఆ ప్రభావం ఉంటుందని కొందరు న్యాయవాదులు బహిరంగంగానే విమర్శించడం టీవీ ఛానల్స్ లో చూశాము.

న్యాయమూర్తులు నిజాయితీగా తీర్పులు చెబుతున్నా… చంద్రబాబు విషయం వచ్చే సరికి మాత్రం జనంలో అనుమానాలు కలిగేలా చేస్తోందన్న భావన ఉంది. చంద్రబాబు ఒక న్యాయమూర్తిని పదేపదే కలిసి వస్తే… సదరు న్యాయమూర్తి చంద్రబాబు, ఆయన ప్రభుత్వానికి సంబంధించిన కేసులో నిజాయితీగా తీర్పు చెప్పినా… అది చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పక్షంలో న్యాయవ్యవస్థ నిజాయితీపై దాని ప్రభావం పడుతోంది. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు, ఇతర రాజకీయ నాయకులతో న్యాయమూర్తులు పదేపదే సమావేశం అవడం సరికాదంటున్నారు. పైగా ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియోలతో సహా దొరికిన నేతల విషయంలో మరింత జాగురూకత అవసరమంటున్నారు. ఏదిఏమైనా తాత్కాలికమైన మనుషుల వల్ల శాశ్వతమైన వ్యవస్థలపై మచ్చ పడకుండా కాపాడుకుంటేనే దేశానికి మంచింది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News