కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

నరహంతకుడు నయీం ఉదంతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా నయీం ఉదంతంపై నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నయీం తనను బెదిరించారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ మంత్రి, ఇతర అధికార పార్టీ నేతలు నయీంను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో […]

Advertisement
Update:2016-08-16 14:27 IST

నరహంతకుడు నయీం ఉదంతం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా నయీం ఉదంతంపై నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నయీం తనను బెదిరించారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ మంత్రి, ఇతర అధికార పార్టీ నేతలు నయీంను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారన్నారు. తాను 2009లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి నయీం ఆగడాలను ఎదిరిస్తూ వచ్చానని అందుకే తనపై కక్ష పెంచుకున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నయీం డైరీలో ఉన్న వారి వివరాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నయీంతో సంబంధాలున్న వారిలో 99 శాతం మంది టీఆర్‌ఎస్ నేతలేనని చెప్పారు. నిజాలు బయటకు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని… నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే నయీం ద్వారా లబ్ధి పొందిన నేతలు, అధికారులను కఠినంగా శిక్షించాలని ఒక టీవీ ఛానల్‌తో మరో సందర్భంలో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News