ప్రజల మూఢ విశ్వాసాలకు...ప్రభుత్వాల పుణ్య స్నానాలు!
ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల నమ్మకాలను ప్రశ్నించవు. వాళ్లు ఎలాంటి విశ్వాసాలతో ఉన్నా…వాటి వలన వారు ఎంత ఇబ్బందుల పాలవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. పైగా ప్రజల మూఢత్వాన్ని పెంచి పోషిస్తుంటాయి. ప్రజా ప్రయోజనాన్ని కోరుతున్నామన్న ముసుగుతో ప్రజలకు ఆకట్టుకుంటాయి…ఓట్లు రాబట్టుకుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల్లో జరుగుతున్న పుష్కరాల సందర్భంగా రెండు ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుని… హేతువాద నాస్తిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ…ఇవే విమర్శలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలు రాజ్యాంగ విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఈ […]
ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల నమ్మకాలను ప్రశ్నించవు. వాళ్లు ఎలాంటి విశ్వాసాలతో ఉన్నా…వాటి వలన వారు ఎంత ఇబ్బందుల పాలవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. పైగా ప్రజల మూఢత్వాన్ని పెంచి పోషిస్తుంటాయి. ప్రజా ప్రయోజనాన్ని కోరుతున్నామన్న ముసుగుతో ప్రజలకు ఆకట్టుకుంటాయి…ఓట్లు రాబట్టుకుంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల్లో జరుగుతున్న పుష్కరాల సందర్భంగా రెండు ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుని… హేతువాద నాస్తిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ…ఇవే విమర్శలు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలు రాజ్యాంగ విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఈ సంఘాలకు చెందిన వారు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వెయ్యికోట్లు, తెలంగాణ 825కోట్ల రూపాయలను పుష్కరాలపై ఖర్చుచేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఒడిదుడుకులతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వృథా ఖర్చుచేయడాన్ని ఆయా సంఘాల వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, 40వేలమంది పోలీసులు శాంతి భద్రతల విధుల్లో పాల్గొనటం, భక్తులకు ప్రత్యేక రవాణా సదుపాయాల ఏర్పాటు…తదితర ఖర్చులన్నీ ప్రభుత్వాలపై కోట్ల ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. విజయవాడలోని నాస్తిక సంఘం నిర్వాహకులు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ ఇదంతా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. లౌకిక విధానాన్నిపాటించే మనదేశంలో ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కోసం ఇంత ధనాన్ని వినియోగించడం సరికాదని ఆయన అన్నారు. పుష్కరస్నానాలను నిర్వహించడం ద్వారా ప్రభుత్వం మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నదని…రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (హెచ్) లో ప్రభుత్వాలు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి పరచాలని ఉండగా, అందుకు పూర్తి విరుద్ధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ విశ్వాసాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన విమర్శించారు. పుష్కర స్నానాలు ఇన్ఫెక్షన్లకు కారణం కాగలవని డాక్టర్ సమరం హెచ్చరించారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానాలు చేసినవారు.. చర్మం, కళ్లు, గొంతులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు గురయ్యారని, ఈ పుష్కరాలకు నీళ్లే కనిపించడంలేదని…ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మరో నాస్తిక వాది విజయం మాట్లాడుతూ…ఖర్చు ఒక్కటే కాక, రాష్ట్రాలు మతాల మయం అయిపోతున్నాయన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి మతాలను చొప్పిస్తూ, మతాలను రాజకీయం చేస్తున్నారని…అలా ఎన్నికల్లో లాభం పొందుతున్నారని ఆయన అన్నారు.
సెక్యులర్ దేశంలో మతం అనేది వ్యక్తిగతమని…ప్రభుత్వం అందరిది… అని విజయం అన్నారు.
ఇలాంటి కార్యక్రమాలకు శాంతిభద్రతల బాధ్యత వరకు నిర్వహిస్తే పరవాలేదు కానీ…పెద్ద ఎత్తున పుష్కర స్నానాలు ఆచరించేలా ప్రజలను ప్రోత్సహించడం , దీన్ని ప్రభుత్వ ఎజెండాగా మార్చడం మాత్రం సరికాదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మతపరమైన కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారని, అయితే అది వారి వ్యక్తిగత విషయమని… కానీ ప్రజలను ఇలా ఉద్దేశపూర్వకంగా గందరగోళానికి గురిచేయటం మాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. భిన్నప్రాంతాల నుండి వచ్చి ఈ రాష్ట్రాల్లో జీవిస్తున్న వారందరికీ వాక్స్వాతంత్ర్యం, మత స్వేచ్ఛ ఉండి తీరాలని…పైగా మనది సెక్యులర్ దేశమన్న సంగతి మర్చిపోకూడదని ఆయన చెప్పారు.
Click on Image to Read: