చంద్రబాబుది బాధ్యతారాహిత్యమేనంటున్న ఎన్డీఆర్‌ఎఫ్

చంద్రబాబు దేన్ని లెక్కచేసే స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదు. జరిగిన తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకునేలా లేరు. చంద్రబాబు తీరుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు విపత్తు నిర్వాహణ సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఒక పిలుపే వారి ఆందోళనకు కారణం. పుష్కరాలను సినిమా షూటింగ్‌లా మార్చేసిన చంద్రబాబు బోయపాటితో షార్ట్‌ ఫిల్మ్ తీయించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పుష్కరాలకు వచ్చిన భక్తులు సెల్ఫీలు దిగి తనకు పంపాలని… సంబరాలను […]

Advertisement
Update:2016-08-14 07:32 IST

చంద్రబాబు దేన్ని లెక్కచేసే స్థితిలో ఉన్నట్టు కనిపించడం లేదు. జరిగిన తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకునేలా లేరు. చంద్రబాబు తీరుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు విపత్తు నిర్వాహణ సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన ఒక పిలుపే వారి ఆందోళనకు కారణం. పుష్కరాలను సినిమా షూటింగ్‌లా మార్చేసిన చంద్రబాబు బోయపాటితో షార్ట్‌ ఫిల్మ్ తీయించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పుష్కరాలకు వచ్చిన భక్తులు సెల్ఫీలు దిగి తనకు పంపాలని… సంబరాలను పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

సాధారణంగా లక్షల మంది గుమిగూడే చోట సెల్ఫీలాంటివి సరికాదని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. అందులోనూ నదులు, సముద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడాన్ని ఇప్పటికే పలు ప్రభుత్వాలు నిషేధించాయి. ముంబాయిలో ఇప్పటికే 16చోట్ల సెల్ఫీలను నిషేధించారు. సెల్ఫీల కారణంగా చాలా మంది ఇక్కడ మృత్యువాతపడడమే అందుకు కారణం. భద్రతను దృష్టిలోఉంచుకుని స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈనెల 12నుంచి 18వరకు సెల్పీలను ఢిల్లీలో నిషేధించింది కేంద్రం. దేశంలో మొత్తం ఇలా సెల్పీలపై నియంత్రణ విధిస్తుంటే లక్షల మంది వచ్చే నదీ తీరంలో సెల్పీలు దిగాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రే పిలుపునివ్వడంపై ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా బాధ్యతరాహిత్యమని… ఎవరు చెప్పినా ఏపీ ప్రభుత్వం వినే పరిస్థితిలోనూ లేదని ఆందోళన చెందుతున్నారు.

పుష్కరాలు వంటి కార్యక్రమాలను పనిగట్టుకుని మార్కెటింగ్ ఈవెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించడంపై ఎన్డీఆర్‌ఎఫ్ ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయినా చంద్రబాబు తగ్గడం లేదు. గతేడాది గోదావరి పుష్కరాల సమయంలో 30 మంది బలైపోయాక కూడా చంద్రబాబు ధోరణిలో మార్పు లేకపోవడం, పబ్లిసిటీ పిచ్చితో సెల్పీలు, షార్ట్ ఫిల్మ్‌లు అంటూ ప్రమాదాలకు పురిగొల్పేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమేనంటున్నారు. జనం చంద్రబాబు పిలుపును పట్టించుకోకుండా స్నానం చేసి వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోతే రద్దీ నియంత్రణకు సహకరించడంతో పాటు ప్రమాదాలకు దూరంగా ఉన్నవారవుతారని ఎన్డీఆర్‌ఎఫ్ నిపుణులు సూచిస్తున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News