నయీం చీరెందుకు కట్టేవాడు?
పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతజీవితం గడిపిన నయీం పలు రకాల వేషాలు మార్చేవాడు. ఈ విషయం అతనింట్లో లభించిన విగ్గులు, మేకప్ కిట్ల వల్ల తెలుస్తోంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చాలాసార్లు నయీం చీరకట్టుకుని తిరిగేవాడని నయీం అనుచరులు పోలీసుల విచారణలో వెల్లడించారట. ఆడవారిలా ఎలా నడవాలి? ఎలా కదలాలి? అన్న విషయంలో నయీం అనుచరులైన ఫర్హానా, అప్షా అతనికి సహకరించేవారని సమాచారం. పలుమార్లు బురఖా కూడా ధరించినట్లు తెలిసింది. 1. తనను పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు […]
Advertisement
పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతజీవితం గడిపిన నయీం పలు రకాల వేషాలు మార్చేవాడు. ఈ విషయం అతనింట్లో లభించిన విగ్గులు, మేకప్ కిట్ల వల్ల తెలుస్తోంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చాలాసార్లు నయీం చీరకట్టుకుని తిరిగేవాడని నయీం అనుచరులు పోలీసుల విచారణలో వెల్లడించారట. ఆడవారిలా ఎలా నడవాలి? ఎలా కదలాలి? అన్న విషయంలో నయీం అనుచరులైన ఫర్హానా, అప్షా అతనికి సహకరించేవారని సమాచారం. పలుమార్లు బురఖా కూడా ధరించినట్లు తెలిసింది.
1. తనను పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఓ డాక్టర్ని సంప్రదించాడు. నకిలీపాస్ పోర్టుతో విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి ఎన్ కంపెనీ రన్ చేయాలని ప్లాన్ వేశాడట.
2. తన చుట్టూ పిల్లలు, మహిళల్ని రక్షణగావాడుకునేవాడు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ. నయీం ఇందుకోసం ఓ 50 మంది మహిళలు-పిల్లల్ని తెలంగాణ, గోవాల్లోని తన స్థావరాల్లో పెట్టాడు.
3. నయీంకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ కూడా వచ్చిందని సమాచారం. వ్యాధి నిరోధకత పెంచుకునేందుకు అతనింట్లో దొరికిన మందులే ఇందుకు నిదర్శనం.
4. నయీమ్‌కు ఇప్పటికే హిజుబుల్ ముజాహిదీన్‌తో సంబంధాలు ఉన్నాయి. కాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తోనూ సంప్రదింపులు జరిపాడని తెలిసిందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
5. నయీం తెలంగాణలో తనకు అడ్డు అనుకున్న ప్రతి నేతనూ టార్గెట్ చేశారని సమాచారం. సోలిపేట రామలింగారెడ్డి, పైళ్ల రాజశేఖర్ రెడ్డి, వేముల వీరేశంలతోపాటు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సైతం లేపేయాలని అనుకున్నాడట.
Advertisement